Spielberg: ‘ఇండియానా జోన్స్ -5’రిలీజ్ డేట్ ఫిక్స్

Surya Prakash   | Asianet News
Published : Jun 04, 2022, 10:59 AM IST
Spielberg: ‘ఇండియానా జోన్స్ -5’రిలీజ్ డేట్ ఫిక్స్

సారాంశం

 హాలీవుడ్ సూపర్‌స్టార్ హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించారు.  ఇప్పుడు అయిదో భాగాన్ని కూడా నిర్మించింది ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ వరల్డ్ .  

ప్రపంచ వ్యాప్తంగా ‘ఇండియానా జోన్స్’చిత్రానికి అభిమానులు ఉన్నారు. అందుకే ఈ సినిమాకు ఇప్పటికి నాలుగు సీక్వెల్స్ వచ్చాయి. అలాగే హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ హిట్ మూవీల లిస్ట్‌లో ‘ఇండియానా జోన్స్’ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడీ సూపర్ హిట్ సీరిస్ కు మరో సీక్వెల్ రెడీ అయ్యింది. 

 ప్రపంచానికి అందకుండా చారిత్రక శిథిలాల్లో మిగిలిపోయిన అద్భుతమైన వస్తువుల కోసం అన్వేషించే ఓ పురావస్తు శాఖ అధ్యాపకుని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటికీ నాలుగు భాగాలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర కనకర్షం కురిపించాయి. హాలీవుడ్ సూపర్‌స్టార్ హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించారు.  ఇప్పుడు అయిదో భాగాన్ని కూడా నిర్మించింది ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ వరల్డ్ .  ఎనిమిదేళ్ల విరామం తర్వాత  వస్తున్న ఈ భాగాన్ని కూడా స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తెరకెక్కిస్తారని అందరూ భావించారు. అయితే ఆయన తప్పుకున్నారు.  

James Mangold ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. పిబ్రవరి 2022 కు ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్స్ రాకపోవచ్చు అని హీరో హారిసన్ ఫోర్డ్ ప్రకటించారు. 2023 జూన్ 30 న ఈ అయిదో భాగాన్ని  విడుదల చేయనున్నట్లు డిస్నీ సంస్థ ప్రకటించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?