ఇక తెలుగు సినిమాలు చేయను.. ఎందుకంటే..?

By telugu news teamFirst Published Mar 3, 2020, 12:55 PM IST
Highlights

“నమ్మండి, ఇది చాలా కష్టమైన డెసిషన్ , ఇలా మొదట ఆలోచించటానికే ఇబ్బందైంది,అయితే ఇప్పుడీ డెసిషన్ తీసుకోకపోతే,ఇంక ఎప్పటికీ తీసుకోలేనపించింది,” అంటోందామె.  బ్రిటీష్ టెలివిజన్ షోలలో తనకంటూ గుర్తింపు వస్తోందని, ఇలాంటి సమయంలో అక్కడే సెటిలవ్వటం మంచిదనిపించిందని చెప్తోంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ డిజాస్టర్ చిత్రం కొమురం పులి తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నిఖిషా పటేల్. అయితే ఆ సినిమా ప్లాఫ్ అయినా ఆమె మాత్రం పవన్ సినిమాలో చేయటం వలనో లేక తన పీఆర్ వలనో  అందరికీ గుర్తుంది. ఆమె గత కొంతకాలంగా చెన్నైలో ఉంటూ తమిళ సినిమాలు చేస్తున్నారు. దాదాపు తెలుగు సినిమావాళ్లు ఆమెను మర్చిపోయారు. అయితే ఇప్పుడామె లండన్ కు షిప్ట్ అయ్యిపోయింది. అయితే అందుకు కారణం తను సౌత్ సినిమాల్లో నటించకూడదనే నిర్ణయం అని చెప్తోంది. తాను ఇప్పుడు బ్రిటీష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తోంది.

'కరోనా'పై అవగాహన కల్పిస్తోన్న ఉపాసన!

“నమ్మండి, ఇది చాలా కష్టమైన డెసిషన్ , ఇలా మొదట ఆలోచించటానికే ఇబ్బందైంది,అయితే ఇప్పుడీ డెసిషన్ తీసుకోకపోతే,ఇంక ఎప్పటికీ తీసుకోలేనపించింది,” అంటోందామె.  బ్రిటీష్ టెలివిజన్ షోలలో తనకంటూ గుర్తింపు వస్తోందని, ఇలాంటి సమయంలో అక్కడే సెటిలవ్వటం మంచిదనిపించిందని చెప్తోంది. అందుకే నేను లండన్ లో ఓ ప్లాట్ కొనుక్కున్నాను. గత కొంతకాలంగా సెంట్రల్ లండన్ లోనే ఉంటున్నాను. నేను ఇంటర్నేషనల్ ఏజన్సీ గిల్బర్ట్ వారితో టైఅఫ్ అయ్యాను. నాకు లండన్ హోమ్ టౌన్. అందుకే నేను అక్కడికే షిప్ట్ అయ్యాను అని వివరించింది. లాస్ ఏజన్సీలో కూడా ఓ యాడ్ కన్సస్టన్సీతో టైఅప్ అవుతన్నాను..అక్కడ కూడా నాకు మంచి భవిష్యత్ ఉందనిపిస్తోందని వివరించింది.

అయితే తాను దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ సౌత్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా , ఎస్టాబ్లిష్ చేసుకోపోలేకపోయాను అనే బాధ ఉందని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. తనకు సౌత్ ఇండియన్ సినిమాల్లో వస్తున్న సినిమాలు నచ్చటం లేదని మొహమాటం లేకుండా చెప్పుకొచ్చింది.
 
“నేను దాదాపు 25 సినిమాలు దాకా సౌత్ ఇండస్ట్రీలో చేసాను,బోర్ వచ్చేసింది. నేను ఎంత కష్టపడి పని చేసినా ఆ సినిమాలు ఆడకపోవటంతో విమర్శలు ఎదుర్కొన్నాను. నేను కొత్త గాలి పీల్చుకోవాలనుకుంటున్నాను,లండన్ నుంచి నేను ఇండియా వచ్చింది నిజానికి హిందీ సినిమాల్లో చేయటానికి, కానీ అది జరగలేదు. నేను హిందీలో పెద్ద సినిమాలు చేయాలని ఆశపడ్డాను.కానీ బాలీవుడ్ ...సౌత్ ఇండస్ట్రీ వర్క్ ని మెచ్చుకుంటుంది. కానీ విలువ ఇవ్వదు,”  అని చెప్పుకొచ్చింది.

click me!