Nandi Awards: నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?

By Rajesh Karampoori  |  First Published Dec 30, 2023, 5:01 AM IST

 Nandi Awards: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నంది అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.  హైదరాబాద్‌లో జరిగిన నటుడు మురళీ మోహన్ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈమేరకు హామీ ఇచ్చారు.


Nandi Awards: నంది పురస్కారం.. తెలుగు చలన చిత్ర సీమ అత్యున్నత పురస్కారం. కానీ,  గత ఐదు సంవత్సరాలుగా నంది అవార్డుల ప్రస్తవనే లేదు. చివరిసారి 2017లో  నంది అవార్డులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఆ తర్వాత ఈ అవార్డుల ప్రదానంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. నలుగురికి వినోదాన్ని పంచే కళాకారులకు ప్రోత్సాహాన్నిచ్చే ఈ నంది అవార్డులను ప్రకటించకపోవడం బాధకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

అయినా.. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపానా పోలేదు. ఇలాంటి  తరుణంలో.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నంది అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.  హైదరాబాద్‌లోని దసపల్లాలో జరిగిన నటుడు మురళీ మోహన్ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈమేరకు హామీ ఇచ్చారు.

Latest Videos

ఈ వేడుకలో భాగంగా తొలుత నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించేలా అవార్డులను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ హయాంలో ‘సింహా’ అవార్డులను ప్రకటించినా.. తర్వత కాలంలో కార్యరూపం దాల్చలేదని అన్నారు. అటు జగన్ సర్కార్ కూడా ఈ అవార్డుల ఊసేత్తడం లేదనీ, ఐదేళ్ళ నుంచి అవార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు .. సినీ,టీవీ, నాటక రంగాల వారికి నంది అవార్డులను ఇచ్చి ప్రోత్సాహించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సినీ అవార్డుల విషయాన్ని తీసుకువెళ్లాలని కోరారు. 

ఈ క్రమంలో నటుడు మురళీమోహన్ కు మంత్రి కోటమిరెడ్డి బదులిస్తూ.. సీఎం కలిసి సినీ ప్రముఖులతో సమావేశమై.. ఈ అవార్డుల గురించి చర్చించిస్తామని తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యానన్న ఆయన.. కొత్త ఏడాదిలో సినీ ప్రముఖులు వచ్చి తమని కలవాలని అన్నారు. ఉగాది నాటికి నంది అవార్డులపై కీలక ప్రకటన చేస్తామనీ,  పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులను ఇస్తామని హామీ ఇచ్చారు.

తాను చిన్నప్పుడు నంది అవార్డులు ఇవ్వడాన్ని టీవీల్లో చూసు వాళ్లమని, అవార్డులతో కళాకారులను గౌరవించుకోవటం అవసరమని కోమటిరెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డిని ఓప్పించి, అవార్డులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు, నాలుగు రోజుల్లోనే సీఎం రేవంత్‌తో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.

అంతకంటే ముందు రోజు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నంది అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి మళ్లీ నంది అవార్డులు అందజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు . కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఇచ్చే నంది అవార్డుల ప్రక్రియ ఆగిపోవడం బాధాకరమన్నారు. మళ్లీ ఈ అవార్డులు ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.  
 

click me!