గర్భంతో ఉన్నపటికీ ఆ పని చేసిందా.. సీనియర్ హీరోయిన్ వీడియో వైరల్!

Published : Jan 19, 2020, 05:16 PM ISTUpdated : Jan 19, 2020, 05:19 PM IST
గర్భంతో ఉన్నపటికీ ఆ పని చేసిందా.. సీనియర్ హీరోయిన్ వీడియో వైరల్!

సారాంశం

హీరోయిన్ స్నేహ గురించి పరిచయం అవసరం లేదు. దక్షణాది చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో స్నేహ నటించింది. పెళ్లయ్యాక స్నేహకు హీరోయిన్ గా అవకాశాలుతగ్గాయి. దీనితో స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ ఎంచుకుంటోంది. 

సెకండ్ ఇన్నింగ్స్ లో స్నేహకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా స్నేహ తమిళ చిత్రం పటాస్ లో నటించింది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా స్నేహ కీలక పాత్రలో నటించింది. స్నేహ పాత్ర చాలా సాహసంతో కూడుకున్నది. వర్మ కళ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతికి విడుదలైన పటాస్ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. 

దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. సెకండ్ హాఫ్ లో వచ్చే వర్మ కళ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వర్మ కళ అనేది ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యం కాదు. అలాంటి మార్షల్ ఆర్ట్స్ సన్నివేశాల్లో స్నేహ అదరగొట్టింది. తాజాగా స్నేహ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

చిరంజీవికే సపోర్ట్ చేసిన సుమన్.. రాజశేఖర్ గురించి అలా..!

ఈ చిత్ర చిత్రీకరణ సమయంలో స్నేహ గర్భవతి అయింది. నాలుగు నెలల గర్భవతి అయినప్పటికీ స్నేహ వర్మ కళలో శిక్షణ తీసుకుంది. సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించింది. వైద్యుల సలహాలకు అనుగుణంగా స్నేహ ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించిందట. ఆమె భర్త అనుక్షణం స్నేహ వెంటే ఉండేవారని దర్శకుడు సెంథిల్ అన్నారు. ఓ కీలకమైన యాక్షన్ సీన్ లో నటించే సమయంలో చిత్ర యూనిట్ మొత్తం భయపడిపోయామని సెంథిల్ అన్నారు. 

స్నేహ వర్మ కళలో శిక్షణ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?