మణిరత్నంకు ప్రపోజ్‌ చేసిన యంగ్ హీరోయిన్

Published : Apr 07, 2020, 05:50 PM IST
మణిరత్నంకు ప్రపోజ్‌ చేసిన యంగ్ హీరోయిన్

సారాంశం

చెలియా సినిమా రిలీజ్‌ అయిన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర కథానాయిక అదితీరావ్ హైదరి ఓ ఆసక్తికర ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. చిత్ర దర్శకుడు మణిరత్నంకు రోజ్‌ ఫ్లవర్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసింది ఈ బ్యూటీ.

భారత దేశం గర్శించదగ్గ దర్శకుల్లో ఒకడు గ్రేట్‌ డైరెక్టర్ మణిరత్నం. రాశీ కన్నా వాసి గొప్పదని నమ్మే మణిరత్నం నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన  సినిమాలు కొన్ని కమర్షియల్‌గా వర్క్ అవుట్ కాకపోయినా దర్శకుడిగా ఆయనకు మాత్రం ఎప్పుడూ తన మార్క్ చూపించాడు. ప్రతీ ఫ్రేము ఓ గ్రీటింగ్ కార్డ్‌ లా చిత్రీకరించే మణిరత్నం హీరోయిన్లను ప్రజెంట్ చేయటంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం పొన్నియన్‌ సెల్వన్ సినిమాను రూపొందిస్తున్న మణిరత్నం ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భారీగా రూపొందిస్తున్నాడు. అయితే మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ప్రేమ కథా చిత్రం కాట్రు వెలియిడై. ఈ సినిమాను తెలుగులో చెలియా పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రెండు భాషల్లోనూ ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లు, పాటల ప్రజల మనసులో ముద్ర వేసుకున్నాయి. ఈ  

షూటింగ్ సందర్భంగా సరదాగా దర్శకుడు మణిరత్నంకు ఆమె ఫ్లవర్‌ ఇచ్చి మరీ ప్రపోజ్‌ చేస్తున్న ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు `మణీ సర్‌.. నేను కలలను నిజమవుతాయని నమ్మటానికి కారణం` అంటూ కామెంట్‌ చేసింది. తెలుగులో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న అదితి, ప్రస్తుతం అదే దర్శకుడితో `వి` సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?