వరుస ఫ్లాప్ లు.. ఛాన్స్ లు మాత్రం తగ్గడం లేదు!

Published : Dec 17, 2019, 03:26 PM ISTUpdated : Dec 17, 2019, 03:34 PM IST
వరుస ఫ్లాప్ లు.. ఛాన్స్ లు మాత్రం తగ్గడం లేదు!

సారాంశం

ప్రస్తుతం ఈ కుర్ర హీరో నటించిన 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన చిత్రమే.. దీని తరువాత రాజ్ తరుణ్ చేయబోయే సినిమాలు పెద్ద బ్యానర్లోవి కావడం విశేషం.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చివరి హిట్ సినిమా ఏదో కూడా జనాలకు గుర్తుండి ఉండదు. గత రెండు, మూడేళ్లలో అరడజనుకి పైగా ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి మార్కెట్ స్థాయి కూడా పడిపోయింది.

దిల్ రాజు బ్యానర్ లో చేసిన 'లవర్' సినిమా కూడా రాజ్ తరుణ్ ని కాపాడలేకపోయింది. ఇన్ని ఫ్లాప్స్ ఎదురవుతున్నా.. మార్కెట్ ఎంత దెబ్బ తిన్నా రాజ్ తరుణ్ కి సినిమా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. పైగా అన్నీ పెద్ద బ్యానర్ ల నుండి ఛాన్స్ లు రావడం విశేషం.

అనసూయపై స్పైసీ కామెంట్.. ఫోటో బయట పెట్టిన డైరెక్టర్!

ప్రస్తుతం ఈ కుర్ర హీరో నటించిన 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన చిత్రమే.. దీని తరువాత రాజ్ తరుణ్ చేయబోయే సినిమాలు పెద్ద బ్యానర్లోవి కావడం విశేషం. 'ఇద్దరిలోకం ఒకటే' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన తదుపరి సినిమా విశేషాల గురించి రాజ్ తరుణ్ వెల్లడించాడు.

బాలీవుడ్ 'డ్రీమ్ గర్ల్' సినిమా రీమేక్ లో నటించబోతున్నట్లు చెప్పారు. ఆ రీమేక్ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ల దగ్గర ఉన్నాయి. ఈ బ్యానర్ లో రాజ్ తరుణ్ కి మొదటి సినిమా అవుతుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు రాజ్ తరుణ్ వెల్లడించాడు.

ఇదే బ్యానర్ లో గతంలో'రంగులరాట్నం' లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చినా.. రాజ్ తరుణ్ ని వెతుక్కుంటూ మరో అవకాశం రావడం విశేషం. ఈ సినిమాలతో పాటు గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలిపాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ కుర్ర హీరోని నమ్మి ఇలా వరుస అవకాశాలు ఇవ్వడం విశేషమే మరి.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?