'హిట్టు కొట్టి చాలా మందికి సమాధానం చెప్పావ్'.. నితిన్ సెటైర్ ఎవరిపై ?

By tirumala ANFirst Published Feb 25, 2020, 4:23 PM IST
Highlights

యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాలకు భీష్మ చిత్రం అడ్డుకట్ట వేసింది. గత వారం విడుదలైన భీష్మ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు.

యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాలకు భీష్మ చిత్రం అడ్డుకట్ట వేసింది. గత వారం విడుదలైన భీష్మ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీష్మ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పూయిస్తోంది. వెంకీ కుడుముల తయారు చేసుకున్న ఫన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో బాగా వర్కౌట్ అయ్యాయి. 

నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. తాజాగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లోనితిన్, రష్మిక, వెంకీ కుడుములతో పాటు ఇతర చిత్ర యూనిట్ పాల్గొంది. సక్సెస్ మీట్ లో నితిన్ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. 

నితిన్ తాం ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడు వెంకీ కుడుముల తనకు సరైన సమయంలో మంచి సక్సెస్ అందించాడని అన్నాడు. వెంకీ కుడుములని దగ్గరకు తీసుకుని.. ఈ హిట్టుతో నువ్వు చాలా మందికి సమాధానం చెప్పావ్ అని నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఈ చిత్రం విజయం సాధించడం నాకు ఎంత ముఖ్యమో, వెంకీకి కూడా అంతే ముఖ్యం అని నితిన్ అన్నాడు. వెంకీ కుడుములని కౌగలించుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో వెంకీ కుడుముల కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. 

గంగూలీ బయోపిక్: నగ్మాతో ఎఫైర్ ఉంటుందా ?

కొన్ని వారాల క్రితం యంగ్ హీరో నాగ శౌర్య ఓ ఇంటర్వ్యూలో వెంకీ కుడుములపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఛలో చిత్రం తర్వాత వెంకీ తనతో మాట్లాడడం లేదని, తాను గిఫ్ట్ గా ఇచ్చిన కారు కూడా అమ్మేశాడని నాగశౌర్య కామెంట్స్ చేశాడు. శౌర్య ఆరోపణలపై వెంకీ స్పందించలేదు. ఇప్పుడు భీష్మ చిత్రం విజయం సాధించాక.. వెంకీ కుడుములని దగ్గరకు తీసుకుని 'చాలా మందికి సమాధానం చెప్పావ్' అని నితిన్ చేసిన కామెంట్స్ కు అర్థం ఏంటనే చర్చ జరుగుతోంది. 

 

click me!