సజ్జనార్ ని నిలదీయడానికి తోసుకుంటూ వస్తారు.. హరీష్ శంకర్ కు బాగా మండింది

By tirumala ANFirst Published Apr 3, 2020, 11:11 AM IST
Highlights

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ప్రపంచం మొత్తం స్తంభించి పోయిన ఈ టైంలో ప్రజలకు డాక్టర్లే దేవుళ్ళు. అలాంటి డాక్టర్లపైనే గాంధీ ఆసుపత్రిలో దాడి జరిగింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ప్రపంచం మొత్తం స్తంభించి పోయిన ఈ టైంలో ప్రజలకు డాక్టర్లే దేవుళ్ళు. అలాంటి డాక్టర్లపైనే గాంధీ ఆసుపత్రిలో దాడి జరిగింది. కరోనాతో ఓ వ్యక్తి మరణించగా అతడి బంధువులు డాక్టర్లపై ఆగ్రహంతో దాడి చేశారు. 

ఈ సంఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇక సామజిక అంశాలపై తరచుగా స్పందించే డైరెక్టర్ హరీష్ శంకర్ కి కూడా ఈ సంఘటన ఆగ్రహం తెప్పించింది. ఈ సంఘటనపై హరీష్ స్పందిస్తూ మానవ హక్కుల సంఘాల పేరుతో మీడియాలో రచ్చ చేసే వారిపై సెటైర్లు పేల్చాడు. 

సీపీ సజ్జనార్ దిశా సంఘటన నిందితులని ఎన్కౌంటర్ చేసిన్పపుడు మానవ హక్కుల సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ విషయాన్నే హరీష్ పరోక్షంగా ప్రస్తావించారు. సజ్జనార్ సర్ ని నిలదీయడానికి మాత్రం తోసుకుంటూ ముందుకు వస్తారు. నిన్న జరిగిన సంఘటనపై మాత్రం మానవ హక్కుల సంఘాల పత్తా లేదు. 

వైరల్ వీడియో: హాట్ బ్యూటీ మలైకా లడ్డూలు ఎలా చేస్తుందో చూశారా!

డాక్టర్లు, నర్సులు, పోలీసులు మనుషులు కాదా అని హరీష్ శంకర్ మానవ హక్కుల సంఘాలని ప్రశ్నించారు. ప్రాధాన్యత లేని అంశాలకు మాత్రం మానవ హక్కుల సంఘ కార్యకర్తలు టివి ఛానల్స్ లో డిబేట్లు చేస్తారనే విమర్శ చాలా  కాలంగా ఉంది. 

ఇక సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ హరీష్ శంకర్ త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండోసారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. 

డాక్టర్లు, నర్సులు..... పోలీస్ లు
పౌరులు, మానవులు కాదా..!!?

నిన్న జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు...!!

సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం .....
తోసుకుంటూ ముందుకొస్తారు .....

— Harish Shankar .S (@harish2you)
click me!