మలైకా వయసు 46 ఏళ్ళు.. అయినా  గ్లామర్ షోలో కన్నె పిల్లలా రెచ్చిపోతోంది. మలైకా ప్రేమ వ్యవహారాలు కూడా భలే విచిత్రంగా ఉంటాయి. తన భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా ప్రస్తుతం తనకన్నా 12 వయసులో చిన్న అయిన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. వీరిద్దరి రొమాన్స్ చూసి బాలీవుడ్ వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి. 

ఇదంతా పక్కన పెడితే మలైకా తనకు తాను బాగా పబ్లిసిటీ చేసుకుంటుంది. నాలుగు పదుల వయసులో కూడా ఫిట్ నెస్ కోసం మలైకా పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. క్రమం తప్పకుండా జిమ్ లో కసరత్తులు చేసే మలైకా ఆ వీడియోల్ని, ఫొటోల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#QuarantineDiaries : Malaika tries her hand in making besan ke laddoos. They look so yum😋 . . #MalaikaArora

A post shared by bollywood_fp (@instantbollywood2020) on Apr 2, 2020 at 12:09am PDT

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ ఐటెం బ్యూటీ కొత్త ప్రయోగాలు మొదలు పెట్టింది. వివిధ రకాల వంటకాలు చేస్తూ టైం పాస్ చేస్తోంది. తాజాగా శనగ పిండి లడ్డూలు తయారుచేస్తున్న  చేస్తున్న వీడియో అభిమానులతో పంచుకుంది. 

లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే గడుపుతున్న మరికొన్ని దృశ్యాలని కూడా మలైకా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మలైకా లడ్డూలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.