టాలీవుడ్ లో  లీడింగ్ ప్రొడ్యూసర్ ఎవరూ అంటే దిల్ రాజు అని చెప్తారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా అందరితో సోలో ప్రొడ్యూసర్ గా సినిమాలు చేసారు. అయితే అది గతం. ఇప్పుడు కూడా ఆ అవకాసం ఆయనకి మళ్లీ రావటం లేదు.  ఆయన వరసపెట్టి స్టార్స్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు కానీ సెట్ మీదకు వెళ్లటం లేదు. అదే ఆయన్ని కంగారు పెడుతోంది అంటున్నారు.
 
ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న  “సరిలేరునీకెవ్వరు”,లో ఆయన మెయిన్ ప్రొడ్యూసర్ కాదు..కేవలం ఓ పార్టనర్ మాత్రమే. అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా అనుకుంటే అది హోల్డ్ లో పెట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ , ప్రభాస్ వరసగా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ ప్లాన్ చేసారు.

ప్రభాస్ వదులుకున్న సినిమాలు.. ఆ హీరోలకు బ్లాక్ బస్టర్లు

 అయితే ఆ సినిమా లాంచింగ్ అవటం లేదు. పవన్ ఈ విషయమై తేల్చటం లేదు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏదో ఒక స్టార్ హీరో సినిమా సోలో ప్రొడ్యూసర్ గా  త్వరగా ప్రారంభించాలనేది దిల్ రాజు ప్లాన్. అందుకు తగ్గ వనరులు ఉన్నా వర్కవుట్ కావటం లేదు. ఇప్పుడు దిల్ రాజు సోలో ప్రొడ్యూసర్ గా  చేస్తున్న సినిమాలు అన్ని చిన్న సినిమాలే. అవి పెద్ద హిట్ అయినా స్టార్ తో చేసిన పేరు తెచ్చి పెట్టవు.  దాంతో ఎలాగైనా  తన స్నేహితుడైన ప్రభాస్ తో అయినా సినిమా ప్రారంభించాలనే ఉద్దేశ్యంలో దిల్ రాజు ఉన్నారట.

ప్రభాస్ తను చేసే ప్రతీ సినిమా ప్యాన్ ఇండియా స్దాయిలో ఉండాలని..ఆ స్దాయి కథ, డైరక్టర్ తో అయితే ప్లాన్ చేద్దాం అని చెప్పారట. దిల్ రాజు దాంతో రకరకాల ఆప్షన్స్ చూస్తున్నారట. వంశీ పైడిపల్లిని..ఓ సబ్జెక్టు ప్రభాస్ కు రెడీ చేయమని పురమాయించారట. బాహుబలి స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు అన్ని ప్రాంతాల వారిని మెప్పించే యూనివర్శిల్ సబ్జెక్టు అవ్వాలి. కొత్త లుక్ తో ప్రభాస్ కనిపించగలగాలి. ఏం చేస్తే బెస్ట్ అనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న ప్రశ్న. దిల్ రాజు సైతం రైటర్స్ తో ఈ విషయమై చర్చలు జరుపుతున్నారట.