కబడ్డీ కోచ్ గా గోపీచంద్.. నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్?

prashanth musti   | Asianet News
Published : Dec 26, 2019, 01:52 PM ISTUpdated : Dec 26, 2019, 02:00 PM IST
కబడ్డీ కోచ్ గా గోపీచంద్.. నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్?

సారాంశం

2014 లౌక్యం అనంతరం గోపి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను కూడా అందుకోవడం లేదు. బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. జిల్ సినిమా కొంత మంచి కలెక్షన్స్ ని అందించినప్పటికీ ఆ తరువాత వరుసగా అపజయాలు గోపి కెరీర్న్ తీవ్రంగా దెబ్బ కొట్టాయి.

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వారిలో గోపీచంద్ కూడా ఉన్నాడు. 2014 లౌక్యం అనంతరం గోపి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను కూడా అందుకోవడం లేదు. బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. జిల్ సినిమా కొంత మంచి కలెక్షన్స్ ని అందించినప్పటికీ ఆ తరువాత వరుసగా అపజయాలు గోపి కెరీర్న్ తీవ్రంగా దెబ్బ కొట్టాయి.

వరుసగా ఐదు సినిమాలు నిరాశపరచడంతో చివరికి తన పర్సనల్ మేనేజర్ ని తీసేశాడు.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ గోపీచంద్ ఒక డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. కమర్షియల్ దర్శకుడు సంపత్ నందితో రెండవసారి చేస్తున్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరక్కుతోంది. ఇక సినిమాకు సిటీ మార్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ సెక్సీ డాన్స్, వీడియో వైరల్.. నెటిజన్ల ట్రోలింగ్!

ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గోపీచంద్ ఈ కథలో ఆంధ్ర ఉమెన్ కబడ్డీ టీమ్ కోచ్ గా కనిపించబోతున్నాడు.  ఇక సినిమాలో కథానాయికగా నటిస్తున్న తమన్నా భాటియా తెలంగాణ మహిళ కబడ్డీ జట్టుకు కోచ్ గా కనిపించనుందట. కోచ్ ల మధ్య సాగే హై వోల్టేజ్ డ్రామా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందట.

ఇక దర్శకుడు సంపత్ నంది కూడా ఈ సారి మంచి సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. రెండేళ్ల క్రితం గోపీచంద్ తో గౌతమ్ నంద అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆసినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?