గొల్లపూడి జీవితంలో విషాద ఘటన.. అజిత్ తో సినిమా తీస్తూ కుమారుడి మృతి

By Prashanth M  |  First Published Dec 12, 2019, 3:23 PM IST

మారుతీ రావు మరణం సినీ ప్రముఖులను సౌత్ ఆడియెన్స్ ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన గొల్లపూడి జీవితంలో ఆనంద క్షణాలతో పాటు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. అందులో ఆయనను బాగా కలచివేసిన ఘటన.. ఆయన చిన్న కుమారుడి మరణం.  


గొల్లపూడి మారుతీ రావు మరణం సినీ ప్రముఖులను సౌత్ ఆడియెన్స్ ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన గొల్లపూడి జీవితంలో ఆనంద క్షణాలతో పాటు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. అందులో ఆయనను బాగా కలచివేసిన ఘటన.. ఆయన చిన్న కుమారుడి మరణం.  

దర్శకుడు కావాల్సిన కుమారుడు షూటింగ్ మొదలుపెట్టిన కొన్నిరోజులకే (26 ఏళ్లకే) కన్నుమూయడం ఆయన కుటుంబంలో పెద్ద విషాదాన్ని మిగిల్చింది. గొల్లపూడి మారుతీ రావుకి ముగ్గురు కుమారులు, పెద్దవాళ్ళు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ చిన్నవాడైన శ్రీనివాస్ మాత్రం రచయితగా రాణిస్తూ అప్పట్లో దిగ్గజ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

Latest Videos

Gollapudi Maruti Rao: రూ.100 బహుమతి గొల్లపూడి జీవితాన్నే మలుపుతిప్పింది  

ఈ క్రమంలోనే శ్రీనివాస్ ఒక సినిమాకు డైరక్షన్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అదే ప్రేమ పుస్తకం. హీరో ఎవరో కాదు. నేడు కోలీవుడ్ లో 100కోట్ల మార్కెట్ ఉన్న  స్టార్ హీరోగా కొనసాగుతున్న అజిత్ కుమార్. షూటింగ్ చాలా హుషారుగా మొదలుపెట్టిన శ్రీనివాస్.. రోజు తండ్రి సలహాలు తీసుకుంటూ 8రోజులు సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు. అయితే 1992 ఆగష్టు 12వ తేదీన ఎప్పటిలానే షూటింగ్ ని స్టార్ట్ చేసిన శ్రీనివాస్ ఊహించని ప్రమాదానికి గురయ్యాడు.

డబ్బు చాలా వచ్చేది కానీ.. ఆర్థిక పరిస్థితిపై గొల్లపూడి ఏమన్నారంటే?  

వైజాగ్ బీచ్ లోని ఒక బండమీద హీరోయిన్ పై ఒక సీన్ ని షూట్ చేయడానికి సిద్దమైన శ్రీనివాస్ ని ఒక పెద్ద అల దెబ్బకొట్టింది. అలతో పాటు శ్రీనివాస్ రెప్ప పాటులో కనిపించలేదు. నీళ్ళలోకి వెళ్ళిపోయిన శ్రీనివాస్ కొంతసేపటి తరువాత శవమై కనిపించాడు. శ్రీనివాస్ మరణం గురించి మొదట గొల్లపూడికి ఎవరు చెప్పలేదు.

 

ప్రమాదం జరిగిందని హాస్పిటల్ కి వెళ్ళగానే పోస్టుమార్టం అయిపోయిందని ఒక వ్యక్తి నోట మాట విన్న గొల్లపూడి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కొడుకు మరణంతో ఆగిపోయిన సినిమాను గొల్లపూడి తన డైరెక్షన్ లో పూర్తి చేశారు, కొడుకు పేరుతో  ఫౌండేషన్ ని స్థాపించి ఇండియాలోని ప్రముఖ నటులకు ప్రతిభా పురస్కారంగా అందిస్తున్నారు. 

click me!