'జార్జ్‌రెడ్డి' ట్రైలర్.. చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి కథ!

By AN TeluguFirst Published Oct 8, 2019, 4:05 PM IST
Highlights

చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. 
 

1965 నుండి 1975 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతీ ఒక్కరికీ 'జార్జ్‌రెడ్డి' గురించి తెలిసే ఉంటుంది. ఈ జెనరేషన్ కి ఆయన గురించి తెలియకపోవచ్చు, చరిత్ర కూడా అతడిని మర్చిపోవచ్చు కానీ సమాజస్థాపన కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన గొప్ప నాయకుడు 'జార్జ్‌రెడ్డి'.

ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా సినిమాను రూపొందించారు. టైటిల్ గా కూడా అతడి పేరే పెట్టారు. దసరా సందర్భంగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. వంగవీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌‌లో ఒదిగిపోయాడు. ట్రైలర్ ని ఎంతో ఆసక్తికంగా కట్ చేశారు. 

కాలేజ్ లో గొడవలు, న్యాయం కోసం విద్యార్ధుల పోరాటాలు వంటి అంశాలను ట్రైలర్ లో చూపించారు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తుండగా జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. 

 

click me!