'సైరా' కలెక్షన్స్.. ఆరు రోజులకు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

By AN TeluguFirst Published Oct 8, 2019, 3:50 PM IST
Highlights

సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళతో తన హవా కొనసాగిస్తుంది. 
 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతోంది. బుధవారం నాడు విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ శుక్రవారం నాటికి తగ్గినట్లు అనిపించినా.. శని, ఆదివారాల్లో పుంజుకుంది. సోమవారం అదే ఊపు కొనసాగుతుందా లేదా అనే సందేహాలు కలిగాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ తన దూకుడు కొనసాగించింది.

ఆదివారంతో పోలిస్తే కలెక్షన్స్ కాస్త తగ్గినప్పటికీ ఓవరాల్ గా మాత్రం మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఆరోరోజు కూడా సినిమా రూ.5055 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్స్ 75 కోట్ల మైలురాయిని దాటేశాయి.

దీంతో మొదటివారంలో మెగాస్టార్ సినిమా 80 కోట్ల కలెక్షన్స్ మైలురాయిని అందుకుంది. నెల్లూరు ఈ సినిమా ఆరో రోజు కూడా రూ.21 లక్షల షేర్ రాబట్టింది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా కలెక్షన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. నార్త్ లో మాత్రం సినిమా పరిస్థితి మారలేదు. అక్కడ ఆరురోజులకుగాను 8.25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో కూడా పరిస్థితి అలానే ఉంది. 

ఆదివారానికి 2 మిలియన్ డాలర్స్ మార్క్ టచ్ చేసింది. అయితే అక్కడ ఇంకొక వారం పాటు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది.రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.  ఈ సినిమా మొత్తం థియేట్రికల్ రైట్స్ 150 కోట్లకు పైగానే అమ్మారు. అది రాబట్టాలంటే ఇంకో 45 కోట్ల వరకు వసూళ్లు సాధించాల్సి వుంటుంది. 

click me!