పదేళ్ల తరువాత గీతాంజలి రీ ఎంట్రీ.. బలవంతంగా ఆ పాత్ర చేయాల్సి వచ్చింది!

By Prashanth MFirst Published Oct 31, 2019, 9:21 AM IST
Highlights

నటి గీతాంజలి టాలీవుడ్ లో మొదటగా సీత పాత్రలో కనిపించి అదే పేరుతో పిలుపించుకుంటూ వచ్చారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేసింది. 1972 అనంతరం సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసిన గీతాంజలి దాదాపు 18 ఏళ్ల వరకు వెండితెరపై కనిపించలేదు.

సీనియర్ నటి గీతాంజలి టాలీవుడ్ లో మొదటగా సీత పాత్రలో కనిపించి అదే పేరుతో పిలుపించుకుంటూ వచ్చారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేసింది. 1972 అనంతరం సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసిన గీతాంజలి దాదాపు 18 ఏళ్ల వరకు వెండితెరపై కనిపించలేదు.

భర్త రామకృష్ణ మరణించిన అనంతరం కూడా ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. అయితే చాలా కాలం తరువాత గీతాంజలి పెళ్ళైన కొత్తలో హీరో జగపతికి నానమ్మ పాత్రలో కనిపించారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమాలు మానేసి ప్రశ్నతంగా ఉన్న గీతాంజలి మొదట ఆ సినిమా చేయనని అన్నారట.

also read ఆ దెబ్బతో సినిమాలకు దూరమైన గీతాంజలి.. అన్నగారు చెప్పినా వినకుండా..

దర్శకుడు మదన్ ఎన్ని సార్లు వివరించినా ఆమె ఒప్పుకోలేరట. పైగా నాన్నమ్మ క్యారెక్టర్ అంటే చస్తే చేయనని మొండిగా చెప్పేశారట. ఎంత చెప్పినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు ఆమెని రిక్వెస్ట్ చేయడంతో బలవంతంగా చేయాల్సి వచ్చింది.  కోటశ్రీనివాసరావు కాంబినేషన్ లో గీతాంజలి నటించారు. ఆ కాంబినేషన్ చాలా వరకు సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సినిమా ర్తిలీజైనా అనంతరం గీతాంజలి కోసం చాలా మంది ఎగబడి మరీ సినిమా చూశారు.

ఎక్కడికెళ్లినా ఆ పాత్ర ద్వారా మంచి ప్రశంసలు వచ్చాయని ఆ సక్సెస్ తో వెంటనే మరో 25 ఆఫర్స్ వచ్చినట్లు గత ఇంటర్వ్యూలో గీతాంజలి గుర్తు చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో సినిమా నచ్చకపోయినా ఒప్పుకున్నాను,. కానీ అదే సినిమా తనకు మంచి గుర్తింపు అందించిందని అందుకు చిత్ర యూనిట్ కి ఆమె పలుమార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

click me!