దయనీయ స్థితిలో రిషి కపూర్.. ఆసుపత్రిపై కేసు నమోదు

By Satish ReddyFirst Published May 2, 2020, 10:00 AM IST
Highlights

ఫెడరేషన ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ (FWICE) రిషి కపూర్ ఆఖరి వీడియో అంటూ సర్క్యులేట్‌ అవుతున్న వీడియోపై కంప్లయింట్ ఇచ్చారు. పేషెంట్‌ ప్రైవసీకి భంగం కలిగేలా వ్యవహరించినందుకు గానూ శ్రీ హెచ్‌ఎన్‌ రిలయన్స్ ఫౌండేషన్‌ హాస్పిటల్‌పై ఫిర్యాదు చేశారు.

బాలీవుడ్‌ లెజెండరీ నటుడు రిషి కపూర్‌ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే నేపథ్యంలో రిషి కపూర్‌ చివరి క్షణాల్లో ఆసుపత్రి బెడ్‌పై ఉండగా తీసిన వీడియో అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై చిత్ర పరిశ్రమ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఫెడరేషన ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ (FWICE) వారు ఈ వీడియోపై కంప్లయింట్ ఇచ్చారు. పేషెంట్‌ ప్రైవసీకి భంగం కలిగేలా వ్యవహరించినందుకు గానూ శ్రీ హెచ్‌ఎన్‌ రిలయన్స్ ఫౌండేషన్‌ హాస్పిటల్‌పై ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలో రిషి కపూర్‌ ఐసీయూలో బెడ్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ దయనీయ స్థితిలో కనిపిస్తున్నాడు. అలాంటి వీడియో బయటకు రావటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఈ వీడియోపై కంప్లయింట్‌ ఇచ్చిన FWICE ఈ వీడియోలో రిషి కపూర్ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టుగా కనిపిస్తోంది. వీడియోలో ఓ నర్సు ఆయనకు సెవలందిస్తున్న విషయం కూడా అర్ధమవుతోంది. అంతేకాదు వీడియోను దొంగచాటుగా తీసిన విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు. ఈ కంప్లయింట్‌లో గతంలో వీడియో వినోద్‌ ఖన్నా హాస్పిటల్‌ లో ఉన్న సమయంలో కూడా ఇలాగే వీడియో బయటకు వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

click me!