రిషి జ్ఞాపకాల్లో కపూర్‌ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన కరీనా

Published : May 02, 2020, 09:13 AM ISTUpdated : May 02, 2020, 09:15 AM IST
రిషి జ్ఞాపకాల్లో కపూర్‌ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన కరీనా

సారాంశం

కరీనా షేర్ చేసిన ఆ అరుదైన ఫోటోలో చిన్నాన్న రిషి కపూర్‌తో పాటు, మామ (సైఫ్‌ అలీఖాన్‌ తండ్రి) మన్సూర్‌ అలీ ఖాన్ పటౌడీలు ఉన్నారు. ఇద్దరు సరదాగా ఏదో మాట్లాడుకుంటుండగా తీసిన ఈ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన కరీనా టూ టైగర్స్‌ (రెండు పులులు) అంటూ కామెంట్ చేసింది.

బాలీవుడ్‌ లెజెండరీ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ కాలం పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన చివరకు ఏప్రిల్ 30న తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. టాప్ స్టార్స్‌ నుంచి యంగ్ జనరేషన్‌ నటీనటుల వరకు అంతా రిషితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఈనేపథ్యంలో ఆయన అన్న కూతురు కరీనా కూడా ఓ అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

కరీనా షేర్ చేసిన ఆ అరుదైన ఫోటోలో చిన్నాన్న రిషి కపూర్‌తో పాటు, మామ (సైఫ్‌ అలీఖాన్‌ తండ్రి) మన్సూర్‌ అలీ ఖాన్ పటౌడీలు ఉన్నారు. ఇద్దరు సరదాగా ఏదో మాట్లాడుకుంటుండగా తీసిన ఈ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన కరీనా టూ టైగర్స్‌ (రెండు పులులు) అంటూ కామెంట్ చేసింది. అంతుకు ముందుకు రిషితో తన తండ్రి రణధీర్‌తో కలిసి తాను దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది కరీనా ఈ ఫోటోతో పాటు `నాకు తెలిసిన ఇద్దరు బెస్ట్ బాయ్స్‌... నాన్న ఇంకా చింటూ అంకుల్‌ (రిషి కపూర్‌) అంటూ కామెంట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?