Tharun Bhascker :ప్చ్.. తరణ్ భాస్కర్ ఇలా చేస్తాడనుకోలేదు

Published : Jun 24, 2022, 09:24 AM IST
 Tharun Bhascker :ప్చ్.. తరణ్ భాస్కర్ ఇలా చేస్తాడనుకోలేదు

సారాంశం

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీతో రాబోతున్నారు.

తెలుగులో డైరక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యంకు ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన  ఇప్పటివరకు రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించినా యూత్ లో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన డైరక్షన్ లో వచ్చిన  పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది మంచి సక్సెస్ అయ్యాయి. ఫన్ తో కూడిన, యూత్ ఫుల్ సినిమాలను తీయడంలో స్పెషలిస్ట్  ఈ డైరక్టర్ కొత్త ప్రాజెక్టుపై చాలా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. చాలా కాలం నుంచి ఆయన సినిమా ఎనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ తో ఆయన సినిమా ఉంటుందనుకున్నారు. అయితే ఆ ప్రకటన రాలేదు. ఊహకు అందని విధంగా ఓ చిన్న క్రైమ్ కామెడి చిత్రం ఎనౌన్సమెంట్ వచ్చి షాక్ ఇచ్చింది.
   
విజి సైన్మా మొదటి ఫీచర్ లెంగ్త్ ప్రొడక్షన్ గా నిర్మాతలు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి ‘కీడా కోలా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్ పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్ కి బదులు రక్తం పొందుతూ బయటికి రావడం పోస్టర్ లో ఆసక్తికరంగా వుంది. అలాగే పోస్టర్ లో ఒక పురుగుని కూడా గమనించవచ్చు. “మునుపెన్నడూ చూడని క్రైమ్ కామెడీని ఎక్సపీరియన్స్ చేయండి…” అని మేకర్స్ వెల్లడించారు.

పెళ్లి చూపులు, ఈ నగరానికి పోస్టర్లు పసుపు రంగులో డిజైన్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘కీడా కోలా’ పోస్టర్ ని కూడా పసుపు రంగులో డిజైన్ చేయడం విశేషం.  ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది.

అంతవరకూ బాగానే ఉంది కానీ ఏదో పెద్ద ఎనౌన్సమెంట్ వస్తుందనుకుంటే ఇలా ఓ చిన్న సినిమా అదీ పెద్ద హీరో ఎవరూ లేకుండా రావటం మాత్రం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత చిన్న ప్రాజెక్టు చేయటానికి ఇంతకాలం టైమ్ ఎందుకు తీసుకున్నాడనేది వారి ప్రశ్న.ఈ విషయమై సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?