లాక్ డౌన్ లో కక్కుర్తి.. మద్యం అమ్ముతున్న నటుడు

Published : Apr 20, 2020, 05:43 PM IST
లాక్ డౌన్ లో కక్కుర్తి.. మద్యం అమ్ముతున్న నటుడు

సారాంశం

ఆదివారం చెన్నైలోని అన్నానగర్‌ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో పోలీసులకు పెద్ద ఎత్తున బాటిళ్లు లభ్యమయ్యాయి. మధ్యం విక్రమయిస్తున్న రిజ్వాన్‌ను అరెస్ట్  చేసిన విచారణ చేయగా అతను సినీ రంగంలో సహాయనటుడని తెలిసింది.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా మధ్యం అమ్మకాలపై నిషేదం కొనసాగుతుంది. దీంతో మధ్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది మానసిక ఇబ్బందులతో ఆసుపత్రుల్లో కూడా చేరుతున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన కొంత మంది కక్కుర్తిగాళ్లు భారీ ధరకు ఆల్కాహాల్‌ను అక్రమంగా అమ్ముతున్నారు. తాజాగా ఓ తమిళ సినీ నటుడు ఇలా అక్రమ మధ్యం అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

చెన్నైలోని స్థానిక ఎంజీఆర్‌ నగర్‌, అన్నా మెయిన్‌ రోడ్‌ లోని ఒక ఇంట్లో అక్రమ మధ్యం నిల్వలు ఉన్నట్టుగా పోలీసులుకు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన దాడుల్లో పోలీసులకు పెద్ద ఎత్తున బాటిళ్లు లభ్యమయ్యాయి. మధ్యం విక్రమయిస్తున్న రిజ్వాన్‌ను అరెస్ట్  చేసిన విచారణ చేయగా అతను సినీ రంగంలో సహాయనటుడని తెలిసింది.

అయితే తన స్నేహితుల ద్వారా క్వాటర్ మందు 1000 రూపాయలకు కొని తాను 1200 లకు అమ్ముతున్నట్టుగా రిజ్వాన్‌ వెల్లడించాడు. దీంతో రిస్కాన్‌ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అతని స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 189 బాటిళ్ల మధ్యంతో పాటు పెద్ద ఎత్తున నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?