రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ పై రాజమౌళి క్లారిటీ.. అది ఇప్పటి ఆలోచన కాదు!

Published : Apr 20, 2020, 05:16 PM IST
రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ పై రాజమౌళి క్లారిటీ.. అది ఇప్పటి ఆలోచన కాదు!

సారాంశం

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది.

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. దీనితో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్న రాజమౌళి వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఇటీవల రాంచరణ్ పుట్టినరోజు సంధర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో చరణ్ పోలీసులు ధరించే ఖాకి ప్యాంట్ లో కనిపించాడు. 

దీనితో చరణ్ పాత్రపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ చరణ్ ధరించింది పోలీస్ డ్రెస్సే అని క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా చరణ్, ఎన్టీఆర్ ఇద్దరితో సినిమా చేయాలనే కోరిక ఇప్పటిది కాదని రాజమౌళి అన్నారు. 

చాలా చాలా ఏళ్లుగా చరణ్, ఎన్టీఆర్ కలసి ఒక చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నా మైండ్ లో తిరుగుతూ ఉండేది. బాహుబలి తర్వహత కొన్ని కథలు అనుకుని ఫైనల్ గా ఆర్ఆర్ఆర్ ని ఎంపికచేశాం అని రాజమౌళి అన్నారు.  

ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.   

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?