
గత కొంతకాలంగా కమల్ కు సరైన హిట్ లేదు. రాజకీయాల్లోకి వస్తే అక్కడా కలిసొచ్చిందేమీ లేదు. కేవలం బిబ్ బాస్ బజ్ తో లాగిస్తున్నాడు. ఈ టైమ్ లో కమల్ ఓ ప్రాజెక్టు సైన్ చేసాడు. దాంతో ఒక్కసారిగా ప్రస్తుతం కమల్ హాసన్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా మారింది "విక్రమ్". ఈ సినిమాకి "ఖైదీ" మరియు "మాస్టర్" ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. దాంతో ఓ రేంజిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైంది.
విశ్వనటుడు కమల్ హాసన్ ను వెండితెరపైన ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించావంటూ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా విజయాన్ని కమల్ హాసన్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే.. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన ఈ మూవీ.. ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీపీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా 8 వ తేదీ ఉదయం 12 గంటల నుంచి ప్రసారంలోకి వచ్చేసింది. ఆల్రెడీ చూసేసిన ఫ్యాన్స్ సైతం మళ్ళీ ఓసారి ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఓటిటిలో ఇంకో రౌండ్ వేస్తున్నారు.
అయితే ఆ అవకాసం అమెరికాలో ఉండే అభిమానులకు ప్రస్తుతానికి లేదు. అక్కడ Hulu లో వస్తుందని ఆశించారు. ఎందుకంటే Hulu, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కంటెంట్ పార్టనర్స్. కానీ విక్రమ్ హాట్ స్టార్ లో ఇక్కడ ఇండియాలో స్ట్రీమ్ అవుతోంది కానీ అక్కడ Huluలో రావటం లేదు. అందుకు కారణం విక్రమ్ USA డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని తీసుకోవాలి. ఈ విషయం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కన్ఫర్మ్ చేసి చెప్పింది. వేరే ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉంది.
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. కమల్ హాసన్, ఫాహాద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతిని ఒకేసారి వెండితెర చూసేందుకు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా కమల్ ఏ చిత్రానికి అవనంత బిజినెస్ ఈ సినిమాకు జరిగినట్లు చెప్తున్నారు. మరి ఓటిటిలో ఈ సినిమా ఏ స్దాయి విజయం సాధించబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.