
తెలుగు చలన చిత్రపరిశ్రమను వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల కింద ప్రముఖ సినీయర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతమ్ రాజు (Gautham Raju) మరణాన్ని ఇంకా మరవకముందే మరో విషాదం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాత గోర్లంట రాజేంద్ర ప్రసాద్ (86) (Gorantla Rajendraprasad) తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆరోగ్యం క్షీణించి ఈ ఉదయం కన్నుమూశారు. ఈయన మరణ వార్త తెలియగానే సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
గోరంట్ల రాజేంద్ర ప్రసాద్, రామనాయుడితో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. మాధవి పిక్చర్స్ పతాకంపైనా పలు సినిమాలను నిర్మించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మించిన చిత్రాల్లో... కురుక్షేత్రం, సుపుత్రుడు, ఆటగాడు, దొరబాబు వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అలాంటి ఆయనను కోల్పోవడం పట్ల టాలీవుడ్ పెద్దలు, ప్రముఖులు చింతిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తూ.. భగవంతుడి వేడుకుంటున్నారు.
టాలీవుడ్ కు చెందిన ప్రముఖుల ఇండ్లలో వరుసగా విషాదాలు చోటుచేసుకోవడం పట్ల సినీలోకం దగ్బ్రాంతికి గురవుతోంది. తెలుగులో అగ్ర కథనాయకుల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మీనా భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ప్రముఖ సీనియర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూశారు. అదే రోజు కార్మిక పక్షపాతి ఆర్. నారాయణ మూర్తి తల్లి కూడా మరణించింది. ఈ ఉదయం ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ మరణించడంతో సినీపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.