డేంజర్ జోన్ లో 'డిస్కో రాజా'.. క్లిక్కయితేనే కెరీర్?

By Prashanth MFirst Published Jan 23, 2020, 10:49 AM IST
Highlights

ప్రయోగాలు చేసి హిట్టందుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ ప్రస్తుత రోజుల్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎంతవరకు హిట్టవుతాయో చెప్పలేని పరిస్థితి. ఇక ప్రయోగాత్మకైన సినిమాలు చేస్తే కొన్ని సార్లు అవి కూడా ఊహించని విధంగా దెబ్బకొడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.

ప్రతిసారి ప్రయోగాలు చేసి హిట్టందుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ ప్రస్తుత రోజుల్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎంతవరకు హిట్టవుతాయో చెప్పలేని పరిస్థితి. ఇక ప్రయోగాత్మకైన సినిమాలు చేస్తే కొన్ని సార్లు అవి కూడా ఊహించని విధంగా దెబ్బకొడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు.  రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని పక్కనపెట్టి రాజా ది గ్రేట్ సినిమాతో కాస్త కొత్తగా ట్రై చేసి హిట్టందుకున్నప్పటికీ ఆ తరువాత అదే ఫ్లోను కొనసాగించలేకపోయాడు.

అమర్ అక్బర్ ఆంటోని సినిమా అయితే మరీ దారుణమైన దెబ్బ కొట్టింది. దీంతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని డిస్కో రాజా తో సిద్దమయ్యాడు. సైన్స్ ఫిక్చన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై  ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ ఆ బజ్ సరిపోదేమో అనిపిస్తోంది.  హాలిడేస్ అయిపోయిన తరువాత సినిమా రిలీజ్ అవుతుండడంతో సినిమా కలెక్షన్స్ ఎంతవరకు స్టాండరర్డ్ గా కొనసాగుతాయి అనడం హాట్ టాపిక్ గా మారింది.

మాస్ రాజా నిలదొక్కుకోవాలి అంటే ఈ సినిమాతో తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాలి. ఓ విధంగా ఆయన కెరీర్ డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి. సినిమా అయితే భారీగా రిలీజ్ అవుతోంది.  యూఎస్ లో ప్రీమియర్స్ ని గట్టిగానే ప్రదర్శించనున్నారు. అల వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు నేటితో కాస్త శాంతిచే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని డిస్కోరాజా ఉపయోగించుకోగలిగితే మంచి ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది.   వీకెండ్ లో సినిమా ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరీ రవితేజ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

click me!