రానా '1945' కాంట్రవర్శీ.. డైరెక్టర్ ఏమంటున్నాడంటే..?

By AN TeluguFirst Published Oct 30, 2019, 4:16 PM IST
Highlights

రానా నిర్మాతలపై మండిపడ్డాడు. ఈ సినిమా పూర్తి కాలేదని, రెమ్యునరేషన్ విషయంలో మోసం చేయడంతో సినిమా పూర్తి కాలేదని అన్నారు.

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి '1945' అనే సినిమా నటిస్తున్నట్లు గతంలో ప్రకటించాడు. సినిమా షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో గ్యాప్ ఇచ్చారేమో అనుకున్నారు. కానీ సడెన్ గా దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది.

రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇది చూసిన రానా నిర్మాతలపై మండిపడ్డాడు. ఈ సినిమా పూర్తి కాలేదని, రెమ్యునరేషన్ విషయంలో మోసం చేయడంతో సినిమా పూర్తి కాలేదని అన్నారు.

Bigg Boss3: మేం గొర్రెలమైతే మీరేంటి..? శ్రీముఖి ఫ్యాన్స్ పై నోయెల్ ఫైర్!

ఏడాది కాలంగా చిత్రయూనిట్ ని కూడా కవలేదని.. ఇలా పోస్టర్స్ రిలీజ్ చేసి మార్కెట్  పరంగా అందరినీ మోసం చేసి డబ్బు చేసుకోవడానికి చూస్తున్నారని.. ఇలాంటి వారిని నమ్మకండి అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు. 

అయితే పోస్ట్ చేసిన కాసేపటికి దాన్ని సోషల్ మీడియాలో తొలగించాడు. దీంతో స్పందించిన చిత్రనిర్మాత  రాజరంజన్.. అరవై రోజుల పాటు షూటింగ్ జరిపామని, కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు శివ కుమార్ ఈ వివాదం గురించి మాట్లాడారు. రానా చెప్పినట్లు సినిమా పూర్తి కాలేదనే విషయంలో నిజం లేదని.. షూటింగ్ మొత్తం పూర్తి చేశామని అన్నారు.

అరవై రోజులకు పైగా సినిమా షూటింగ్ సాగిందని, తమిళ వెర్షన్ కి రానా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడని.. సత్యరాజ్, నాజర్ లాంటి ఆర్టిస్ట్ లు కూడా తమ పనిని పూర్తి చేశారని  చెప్పాడు.

కేవలం తెలుగు వెర్షన్ కి రానా డబ్బింగ్ చెప్పడం మాత్రమే మిగిలిందని, అయితే నిర్మతకి.. హీరోకి ఏం గొడవ జరిగిందో తనకు తెలియదని.. వారిద్దరూ సమస్యని పరిష్కరించుకొని సినిమా విడుదలయ్యేలా చూడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. మరోపక్క సినిమాని రిలీజ్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా తాను వెనుకాడనని రానా అంటున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!
 

click me!