వోడ్కా రెండో పెగ్ కి 'మెగాఫ్యామిలీ' తీయాలనుకున్నా.. వర్మ కామెంట్స్!

By AN TeluguFirst Published Oct 30, 2019, 5:03 PM IST
Highlights

'మెగాఫ్యామిలీ' అనేది 39 మంది పిల్లలున్న ఓ వ్యక్తి కథ అని, అయితే అంతమంది పిల్లల్ని పెట్టి సినిమా తీయడం కష్టమనే ఉద్దేశంతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్లు అనౌన్స్ చేశాడు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో 'మెగాఫ్యామిలీ' అనే సినిమా తీయాలనుకుంటున్నట్లు అనౌన్స్ చెప్పాడు. కాసేపటికే ఆ నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పాడు. 'మెగాఫ్యామిలీ' అనేది 39 మంది పిల్లలున్న ఓ వ్యక్తి కథ అని, అయితే అంతమంది పిల్లల్ని పెట్టి సినిమా తీయడం కష్టమనే ఉద్దేశంతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్లు అనౌన్స్ చేశాడు.

ఈ విషయంపై తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'మెగాఫ్యామిలీ' పేరుతో ఈ ట్విస్ట్ ఏంటని..? ప్రశ్నించగా.. వర్మ షాకింగ్ సమాధానం చెప్పాడు. రాత్రి వోడ్కా రెండో పెగ్ వేస్తున్న సమయంలో తనకు 'మెగాఫ్యామిలీ' టైటిల్ తో సినిమా తీయాలనిపించిందని.. కానీ ఉదయం కాఫీ తాగిన తరువాత సినిమా చేయొద్దనిపించిందని.. అదే విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించానని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు వర్మ.

పప్పు సీన్ కు రాంగోపాల్ వర్మ వివరణ.. నా ఉద్దేశం అదే!

నిజంగా ఈ సినిమా మెగాస్టార్ కుటుంబంలో ఎవరి మీదా తీయాలనుకున్నది కాదని.. మెగాఫ్యామిలీ అంటే పెద్ద కుటుంబం అని అర్ధమని.. 39 మంది పిల్లలున్న ఓ వ్యక్తి గురించి తనకు ఎవరో చెబితే అతడి మీద సినిమా తీస్తే బాగుంటుందని ఆ సమయానికి అనిపించిందని.. కానీ పిల్లలతో సినిమా కష్టమని ఆ ఆలోచనని విరమించుకున్నట్లు చెప్పాడు వర్మ. 

అయితే వర్మ 'మెగాఫ్యామిలీ' అని అనౌన్స్ చేసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి అలర్ట్ అయి వార్నింగ్ ఇచ్చి ఉంటారని.. అందుకే వర్మ వెనక్కి తగ్గాడనే మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్మ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ వదిలి షాక్ ఇచ్చాడు. ఏపీ సమకాలీన రాజకీయాలపై  తెరకెక్కుతోన్న ఈ సినిమా మరిన్ని వివాదాలను సృష్టించడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. 

click me!