'ప్రతిరోజూ పండగే' బ్లాక్ బస్టర్ హిట్.. మారుతికి కాస్ట్లీ గిఫ్ట్!

Published : Jan 08, 2020, 07:40 PM IST
'ప్రతిరోజూ పండగే' బ్లాక్ బస్టర్ హిట్.. మారుతికి కాస్ట్లీ గిఫ్ట్!

సారాంశం

డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం ఘనవిజయం సాధించింది. 2019 ఏడాది చివరి సూపర్ హిట్ గా సాయిధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ నిలిచింది. ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంచనా వేశారు.

డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం ఘనవిజయం సాధించింది. 2019 ఏడాది చివరి సూపర్ హిట్ గా సాయిధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ నిలిచింది. ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ప్రతిరోజూ పండగే చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించింది. 

దాదాపు అన్ని ఏరియాలలో ఈ చిత్రం బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. దాదాపు 35 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. దర్శకుడు మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్.. సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా కెమిస్ట్రీ.. రావు రమేష్ నటన, హాస్యం ఇలా అన్ని అంశాలు చక్కగా కుదరడంతో ప్రతిరోజూ పండగే చిత్రం ఘనవిజయం సాధించింది. 

విదేశాల్లో సెటిల్ కావడం, ఫ్యామిలీ, ఉద్యోగం, పని ఒత్తిడి లాంటి గోలలో పడి సొంత తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదనే ఏమోషనల్ పాయింట్ తో మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల సక్సెస్ సెలెబ్రేషన్ కూడా జరిగాయి. 

మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పై అల్లు అర్జున్ కామెంట్స్!

గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈ చిత్రం నిర్మించబడింది. సినిమా విజయం సాధించడంతో యూవీక్రియేషన్స్ నిర్మాత వంశీ దర్శకుడు మారుతికి ఖరీదైన రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. వంశీ తనకు కారు బహుకరిస్తున్న ఫోటోని మారుతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

'థాంక్యూ వంశీ డార్లింగ్.. నీలాంటి ఫ్రెండ్ ఉంటే ప్రతి రోజూ పండగే' అని మారుతి ట్వీట్ చేశారు. మారుతి యూవీ క్రియేషన్స్ కాంబోలో ప్రతిరోజూ పండగే చిత్రంతో పాటు.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?