పవన్ వెళ్తే అలీ ఏడ్చేస్తాడు.. డైరెక్టర్ కామెంట్స్!

Published : Dec 20, 2019, 02:09 PM ISTUpdated : Dec 20, 2019, 02:23 PM IST
పవన్ వెళ్తే అలీ ఏడ్చేస్తాడు.. డైరెక్టర్ కామెంట్స్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అలీ ఇంటికి వెళ్లారు. కానీ అలీకి స్నేహితుడైన పవన్ కళ్యాణ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా అలీకి సానుభూతి తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. 

ప్రముఖ కమెడియన్ అలీ తల్లి జైతున్ బీబీ గురువారం నాడు మరణించిన సంగతి తెలిసిందే. అలీకి తన తల్లి అంటే ఎంతో ప్రేమ.. పలు సందర్భాల్లో తన తల్లిపై ప్రేమని తెలియజేసేవాడు. అలీని ఓదార్చడానికి సినీ ప్రముఖులు అతడి నివాసానికి వెళ్లారు.

అలీ తల్లి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అలీ ఇంటికి వెళ్లారు. కానీ అలీకి స్నేహితుడైన పవన్ కళ్యాణ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా అలీకి సానుభూతి తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.

Prati Roju Pandage: ‘ప్రతిరోజు పండగే’ రివ్యూ..!

స్నేహితుడి తల్లి మరణిస్తే పవన్ వెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని, ఇద్దరి మధ్య విభేదాలు ఉండడం వలనే పవన్ ఇలా చేశారనే మాటలు వినిపించాయి. తాజాగా ఈ విషయంలో సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పవన్ కళ్యాణ్.. అలీ ఇంటికి వెళ్లలేదన్న విషయం చాలా చిన్నదని.. కావాలని ఆ విషయాన్ని పెద్దది చేస్తున్నారని అన్నారు. పవన్ ని చూడగానే అలీ బోరున ఏడ్చేస్తాడని.. పవన్ కూడా బాధ పడతాడని.. వారి మధ్య ఉన్న అనుబంధం అలాంటిదని.. అలాంటి వారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడకూడదని అన్నారు.

తన తల్లి చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో.. అలీ మనసుకి తెలుసునని.. అలీ ప్రత్యేకమైన స్నేహితుడని పవన్ చాలా సార్లు చెప్పారని వెల్లడించారు. చిరంజీవి.. అలీని పరామర్శించారు కాబట్టి పవన్ వెళ్లలేదనే విషయాన్ని హైలైట్ చేస్తున్నారని అన్నారు. చిరంజీవి ఇండస్ట్రీలో పేరున్న సెలబ్రిటీ కాబట్టి పెద్ద మనిషిగా వెళ్లారని చెప్పుకొచ్చారు.  

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?