విజయశాంతి కోసం చాలా తిరిగా.. అనీల్ రావిపూడి కామెంట్స్!

Published : Nov 27, 2019, 02:43 PM ISTUpdated : Nov 27, 2019, 03:02 PM IST
విజయశాంతి కోసం చాలా తిరిగా.. అనీల్ రావిపూడి కామెంట్స్!

సారాంశం

విజయశాంతిని ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు అనీల్ రావిపూడి. 'రాజా ది గ్రేట్' సినిమా సమయంలోనే ఆమెని కలిసినట్లు.. మొదట రామ్ తో ఆ సినిమా చేయాలనుకున్నానని.. విజయశాంతి పాత్ర నిడివి చాలా పెద్దదిగా ఉంటుందని కానీ ఆ సమయంలో ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. 

సీనియర్ నటి విజయశాంతి కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలను పక్కన పెట్టేశారు. తాజాగా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.

ఇటీవల విడుదలైన సినిమా  టీజర్ ఆమె పాత్రపై అంచనాలను పెంచేసింది. అయితే విజయశాంతి రీఎంట్రీ ఎలా జరిగిందనే విషయాన్ని చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి  రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. విజయశాంతిని ఒప్పించడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు అనీల్ రావిపూడి.

వీళ్లు వదలుకున్న క్యారెక్టర్స్ తో.. వాళ్లకి క్రేజ్ వచ్చింది!

'రాజా ది గ్రేట్' సినిమా సమయంలోనే ఆమెని కలిసినట్లు.. మొదట రామ్ తో ఆ సినిమా చేయాలనుకున్నానని.. విజయశాంతి పాత్ర నిడివి చాలా పెద్దదిగా ఉంటుందని కానీ ఆ సమయంలో ఆమె ఒప్పుకోలేదని చెప్పారు.

ఆ తరువాత కథలో మార్పులు చేసి.. రవితేజ, రాధికలతో చేసినట్లు తెలిపారు. ఈసారి మరోసారి ఆమెని సినిమా కోసం ఒప్పించడానికి ప్రయత్నించానని.. కత చెబితే చాలను అనుకొని.. 'స్వాతిముత్యం' సినిమాలో సోమయాజుల చుట్టూ కమల్ హాసన్ తిరిగినట్లు విజయశాంతి చుట్టూ తిరిగానని అన్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.

విజయశాంతికి తను రూపొందించిన 'పటాస్' సినిమా అంటే చాలా ఇష్టమని.. కథ చెబితే ఎక్కడ నచ్చేసి ఒప్పుకోవాల్సి వస్తుందోనని కథ వినేవారు కాదని చెప్పాడు. మూడు రోజుల వరకు కథ వినలేదని.. ఆ తరువాత రెండున్నర గంటలు కథ వివరించానని.. ఆ సమయంలో విజయశాంతి పొట్టపగిలేలా నవ్వారని.. ఆమెని అలా ఎప్పుడూ చూడలేదని అన్నారు.

నో చెప్పడానికి ఛాన్స్ లేకపోవడంతో పాత్ర నచ్చి చేశారని.. ఆవిడ మాత్రమే చేయగలిగే పాత్ర అని అన్నారు. తన దర్శకత్వంలో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం చాలా గొప్పగా ఉందని.. మహేష్, విజయశాంతిలను ఒక ఫ్రేమ్ లో చూడడం ఆడియన్స్ కి థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?