హరీష్ రావ్ రికార్డును బద్దలుకొట్టిన జెనీలియా బావ

By Prashanth MFirst Published Oct 25, 2019, 1:40 PM IST
Highlights

జెనిలియా కుటుంబ సభ్యుల్లో గెలుపు సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జెనీ లియా భర్త రితేష్ దేశ్ ముఖ్ సోదరులు ఇద్దరు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఘన విజయాన్ని అందుకున్నారు. వారు గెలిచేందుకు జెనీలియా భర్త కూడా ప్రచారాల్లో పాల్గొని సోదరుల గెలుపులో కీలకపాత్ర పోషించారు. 

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జెనిలియా కుటుంబ సభ్యుల్లో గెలుపు సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జెనీ లియా భర్త రితేష్ దేశ్ ముఖ్ సోదరులు ఇద్దరు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఘన విజయాన్ని అందుకున్నారు. వారు గెలిచేందుకు జెనీలియా భర్త కూడా ప్రచారాల్లో పాల్గొని సోదరుల గెలుపులో కీలకపాత్ర పోషించారు.

 

హర్యానా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు సహా దేశవ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన సంగతి తెలిసిందే. ఇందులో మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్ లు లాతూర్ జిల్లా నుండి ఘన విజయం సాధించారు.

పవార్ మేనల్లుడి దెబ్బకు హరీష్ రావు రికార్డు గల్లంతు

ముఖ్యంగా లాతూర్ రూరల్ లోక్ సభ నియోజకవర్గం ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటె ధీరజ్ దేశ్‌ముఖ్ కి 1,33,161 ఓట్లు పోలయ్యాయి. లక్షా 2వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి టీఆరెస్ అభ్యర్థి హరీష్ రావ్ రికార్డునుబ్రేక్ చేశారు. 

 

ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ రికార్డు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు పేరిట ఉండేది. గత ఎన్నికల్లో హరీష్ రావు 1,20,650ఓట్ల మెజారిటీ తో గెలిచాడు. ఇప్పుడు అయన రికార్డును ధాటి 1,21,482 ఓట్ల మెజారిటీతో ధీరజ్ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక మరో నేత అజిత్ పవార్ 1,65,265ఓట్ల మెజారిటీ అందుకొని అందరికంటే టాప్ లో నిలిచారు.

click me!