సింగర్, నటికి తీవ్ర అనారోగ్యం.. సాయం కోసం ఎదురుచూపులు!

By AN TeluguFirst Published Oct 25, 2019, 12:28 PM IST
Highlights

ఈ చిత్రలో సింగం పోల అనే పాటతో ప్రాచుర్యం పొందారు. వరుసగా పలు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించే అవకాశాలు రావడంతో దాదాపు ఎనభైకి పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా 2014లో శివకార్తికేయన్ నటించిన 'మాన్ కరాటే'లో నటించారు. 

గ్రామీణ పాటల గాయని, నటి మునియమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక ప్రభుత్వం, సినీ రంగం సాయం కోసం ఎదురుచూస్తోంది. వైద్యసాయం అందించాల్సిందిగా.. ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మధురై జిల్లా, వాడిపట్టి సమీపంలోని పరవై ప్రాంతానికి చెందిన గ్రామీణ పాటల గాయని పరవై మునియమ్మ.

2003లో విక్రమ్ నటించిన 'దూళ్' చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. ఈ చిత్రలో సింగం పోల అనే పాటతో ప్రాచుర్యం పొందారు. వరుసగా పలు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లోనటించే అవకాశాలు రావడంతో దాదాపు ఎనభైకి పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా 2014లో శివకార్తికేయన్ నటించిన 'మాన్ కరాటే'లో నటించారు. ఆ తరువాత ఆరోగ్యం పాడవ్వడంతో నటనకు దూరమైంది.

అనసూయ కొత్త టాటూ.. అర్ధమేంటో తెలుసా..?

పాటలు పాడే అవకాశాలు రాకుండా పోయాయి. మునియమ్మ భర్త గతంలోనే కన్నుమూశారు. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మునియమ్మ పేదరికంతో సొంత ఊరులోనే ఉంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆమె పేరుతో రూ.6 లక్షల వరకు బ్యాంక్ ఖాతాలో జమచేశారు. ఆ డబ్బుతో జీవితాన్ని గడుపుతోన్న మునియమ్మకి ఇటీవల జబ్బు చేసింది.

మదురైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య చికిత్సలు పొందుతూ వచ్చింది. డాక్టర్లు ఆమెకు కిడ్నీలు, గుండె సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. ఆర్ధిక స్థోమత లేక మునియమ్మను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చేశారు. మునియమ్మ పరిస్థితి విషమిస్తుండడంతో ఆమెకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని, సినీపరిశ్రమవర్గాల వారికి ఆమె కుటుంబసభ్యులు అభ్యర్దిస్తున్నారు. 

click me!