అల్లు అర్జున్ జోడీగా దీపికా పదుకొణే, క్రేజీ న్యూస్ లో నిజం ఎంత...?

By Mahesh Jujjuri  |  First Published Oct 30, 2023, 5:24 PM IST

బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ అదే. అల్లు అర్జున్ జోడీగా దీపికా పదుకునే నడిస్తుందంటూ టాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అందులో నిజం ఎంత. 
 


ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియాను శాసిస్తున్నాయి. దాంతో  ఈ సినిమాల్లో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీలను తీసుకుంటున్నారు. అందులోను టాలీవుడ్ హీరోల హవా.. దేశమంతా ఉండటంతో..మన హీరోల సరసన నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో చాలా మంది బాలీవుడ్ భామలు భాగస్వామ్య అయ్యారు.. తాజాగా మరో సినిమాలో మరో బ్యూటీ రెండో సారి తెలుగు సినిమాలో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో నాలుగో ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. అధికారికంగా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే..? అయితే ఈమూవీ షూటింగ్ 2024 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు టీమ్. ఏప్రెల్ నుంచి ఈసినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈమూవీకి సబంధిచిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను త్రివిక్రమ్ టీమ్ ఇప్పటికే స్టార్ట్ చేశారు కూడా. అయితే ఈమూవీకి సబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషలక్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. బన్నీ జోడీగా ఈసినిమాలో బాలీవుడ్ భామ జతకట్టబోతుందట. 

Latest Videos

undefined

ఈ సినిమాలో బన్నీ జోడీగా..  బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పడుకోణె ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా పడుకోణె ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ బన్నీ సరసన స్టెప్స్ వేస్తే అదిరిపోతుంది. అన్నట్టు సెకండ్ హీరోయిన్ గా పూజా హెగ్డేని ఈ సినిమాలో తీసుకోబోతున్నారట. ఇప్పటికే దీపికా.. ప్రభాస్ సరసన కల్కీ సినిమాలో నటిస్తోంది. ఈమూవీ తరువాత వెంటనే బన్నీ ప్రాజెక్ట్ లోకి వెళ్ళబోతుందట. ఈ న్యూస్ అధికారికంగా ప్రకటించకపోయినా.. త్వరలో ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఇక జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టినట్టు అయ్యింది. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ 2024 లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈసినిమా రిలీజ్ తరువాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. 

click me!