పాత బంగారం: ఆ సంఘటనతో 'శివుడు' పాత్రలు వేయనన్న ఎన్టీఆర్

Published : Nov 12, 2019, 01:49 PM ISTUpdated : Nov 12, 2019, 02:38 PM IST
పాత బంగారం: ఆ సంఘటనతో 'శివుడు' పాత్రలు వేయనన్న ఎన్టీఆర్

సారాంశం

1962లో వచ్చిన ఎన్టీఆర్ దక్షయజ్ఞం సినిమాకు కడారు నాగభూషణం దర్శకుడు. ఆయన మరెవరో కాదు... నటి, నిర్మాత పసుపులేటి కన్నాంబ భర్త. 

కృష్ణుడుగా, రాముడుగా పేరు గాంచిన ఎన్టీఆర్ ...శివుడుగా వేసిన చిత్రాలు చాలా తక్కువ. అందులో దక్షయజ్ఞం ఒకటి. లయకారకుడైన పరమేశ్వరునిగా అన్నగారు ఎన్టీఆర్ దక్షయజ్ఞం లో కనిపిస్తారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ కి మంచి పేరు వచ్చింది. కానీ ఈ సినిమా సమయం లో ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ   మరణించారు. లయకారకుడైన శివుని పాత్ర ధరించినందు వల్ల , అది జరిగిందని తలచి, ఇక ఈశ్వరుని పాత్ర ధరించకూడదని నిశ్చయించుకున్నారు.

కానీ విజయా వారు ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకులు శ్రీ కే.వి.రెడ్డి గారు ఎన్టీఆర్ ని శివుని పాత్రలో నటిచమని అడిగారు. తన నిశ్చయాన్ని చెప్పి, క్షమించమని చెప్పారు. లయకారకుడైన శివునిగా కాక భోగ శివమూర్తి గా చిత్రీకరిస్తామని, జాటాఝూటం లేకుండా కిరీటం పెడుతామని, సినిమా ప్రారంభం, చివర మాత్రమే శివునిలా కనిపిస్తారని , మిగతా సినిమా అంత జానపద చిత్రాలలో లా కనిపిస్తారని చెప్పి, ఒప్పించారు. . కానీ ఈ సినిమా అనుకున్నంత విజయం కాలేదు.

హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ.. అప్పటి వరకు ఆగాల్సిందేనా?

1962లో వచ్చిన ఎన్టీఆర్ దక్షయజ్ఞం సినిమాకు కడారు నాగభూషణం దర్శకుడు. ఆయన మరెవరో కాదు... నటి, నిర్మాత పసుపులేటి కన్నాంబ భర్త. ఆయన ఈ దక్షయజ్ఞం చిత్రాన్ని అదే సంవత్సరం తమిళంలో కూడా తీయడం విశేషం. ఆ తర్వాత ఇదే కథాంశం బెంగాళ్ లో కూడా ఘన విజయం సాధించింది.

దక్షిణాదిన దక్షయజ్ఞం  సబ్జెక్టుతో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఇది ఒకటి. అన్నిటికన్నా ముందుగా 1920లో మూకిగా,సతీ పార్వతి పేరుతో సినిమా వచ్చింది.   1922లో ప్రఖ్యాత  మదన్ థియోటర్ వారు ఇదే కథాంశంతో సతి టైటిల్ తో ఇవే కథాంశాన్ని తెరకెక్కించారు. 1927లో నిర్మాత నిర్మాత సాహ్ని మళ్లీ మరో మూకీ సినిమా తీసారు. అప్పట్లో ఇదీ బాగానే నడిచింది.

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?