మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యా.. పృథ్వీ వ్యాఖ్యలు!

Published : Feb 24, 2020, 12:38 PM IST
మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యా.. పృథ్వీ వ్యాఖ్యలు!

సారాంశం

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని అన్నారు. తన చుట్టూ ఉండేవారే వెన్నుపోటు పొడిచారని పృథ్వీ తెలిపారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు. 

గత కొద్దిరోజులుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. కుట్రపూర్వితంగా తనను ఎస్వీబీసీ నుండి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనను ఎస్వీబీసీ నుండి పంపి కొందరు పైశాచిక ఆనందం పొందారని అన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురయ్యానని పృథ్వీ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని అన్నారు. తన చుట్టూ ఉండేవారే వెన్నుపోటు పొడిచారని పృథ్వీ తెలిపారు.

అనసూయ.. ఈ వార్త నిజమైతే,కెరీర్ మలుపు తిరిగినట్లే!

సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు. రాజధాని రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని అన్నారు.

తాను ఏ సామాజిక వర్గాన్నీ టార్గెట్ చేయలేదని.. అది దుష్ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ వైసీపీలో కొనసాగుతానని ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?