మూడు గుడ్లుకు రూ.1672 బిల్లు.. షాకైన మ్యూజిక్ డైరెక్టర్!

By AN Telugu  |  First Published Nov 15, 2019, 11:02 AM IST

బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రవ్జియాని అహ్మదాబాద్ నగరంలోని హోటల్ హయత్ రెజెన్సీ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు. గురువారం నాడు శేఖర్ మూడు ఎగ్ వైట్ లు ఆర్డర్ చేశారు. 


గతంలో బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ బస చేసిన ఓ హోటల్‌లో రెండు అరటి పండ్లకు రూ.442 వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత కార్తిక్ ధార్ అనే ట్విట్టర్ యూజర్ ముంబయిలోని ఫోర్ సీజన్స్ హోటల్.. ఉడికించిన రెండు కోడి గుడ్లకు రూ.1700 వసూలు చేసినట్లు ఆరోపించాడు.

ఆ సమయంలో ఈ ట్వీట్ కూడా చర్చకు దారి తీసింది. ఇవి ఇంకా మర్చిపోక ముందే కేవలం మూడు కోడిగుడ్లకు 1672 రూపాయల బిల్లు వేసిన 5 స్టార్ హోటల్ బాగోతం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో వెలుగుచూసింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రవ్జియాని అహ్మదాబాద్ నగరంలోని హోటల్ హయత్ రెజెన్సీ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు.

Latest Videos

హీరోయిన్ ని అక్క అని పిలుస్తున్న హీరో..!

గురువారం నాడు శేఖర్ మూడు ఎగ్ వైట్ లు ఆర్డర్ చేశారు. ఆ మొత్తం మూడు గుడ్లకు హోటల్ యాజమాన్యం 1672 రూపాయల బిల్లు ఛార్జ్ చేసింది. ఆ బిల్లు చూసిన శేఖర్ షాకయ్యారు.ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బిల్లు ఫోటో కూడా పెట్టారు.

మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, దానికి సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, దీనిపై సీజీఎస్టీ 9 శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9 శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లుని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. అయితే కొందరు మాత్రం శేఖర్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఫైవ్ స్టార్ హోటల్ లో ఫుడ్ ఖరీదు ఆ రేంజ్ లో ఉంటుందనే తెలిసే వెళ్లి మళ్ళీ పాపులారిటీ కోసం ఇలా ట్వీట్లు పెడుతుంటారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మెనూ చూసినప్పుడు రేట్ చూసే ఆర్డర్ చేసి ఉంటావ్ కదా మళ్లీ ఇప్పుడు ఎందుకు ఇలా ఎక్కువ బిల్ అంటూ ఏడవడం అంటూ విమర్శిస్తున్నారు. 

 

Rs. 1672 for 3 egg whites???
That was an Eggxorbitant meal 🤯 pic.twitter.com/YJwHlBVoiR

— Shekhar Ravjianii (@ShekharRavjiani)
click me!