హీరోయిన్ ని అక్క అని పిలుస్తున్న హీరో..!

By AN Telugu  |  First Published Nov 15, 2019, 10:27 AM IST

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. వరలక్ష్మి తనకు మంచి ఫ్రెండ్ అని.. తనను అక్క అని పిలుస్తుంటానని సందీప్ చెప్పాడు


సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు ఒకరినొకరు వరసలు పెట్టుకొని పిలుచుకోరు. ఇక అక్క, తమ్ముడు అని పిలుచుకునే ప్రసక్తే ఉండదు. అందరూ స్నేహంగా ఉంటారు కానీ వరసలు మాత్రం తీసుకురారు. అలాంటిది ఓ యంగ్ హీరో.. హీరోయిన్ ని అక్కడ అని పిలుస్తున్నాడు.

ఈ విషయాన్ని ఆ హీరో స్వయంగా వెల్లడించాడు. సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు.

Latest Videos

‘మహానటి’ డైరక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. లేటెందుకు?

వరలక్ష్మి తనకు మంచి ఫ్రెండ్ అని.. తనను అక్క అని పిలుస్తుంటానని సందీప్ చెప్పాడు. ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తుందని నవ్వుతూ అన్నాడు. నిజానికి వరలక్ష్మి తనకంటే వయసులే చిన్నదేనని కానీ చూడ్డానికి మాత్రం పెద్దగా కనిపిస్తుందని.. అక్క కనిపించగానే కాళ్ల మీద పడిపోయి దండం పెట్టేసి షూటింగ్ కి తీసుకెళ్తానని చెప్పాడు సందీప్ కిషన్.

ఇద్దరికీ అంత క్లోజ్ నెస్ ఉందని.. తను చాలా మందితో క్లోజ్ గా ఉంటానని..కానీ వరలక్ష్మితో ఇంకాస్త ఎక్కువగా ఉంటానని.. అందుకే ఆమెని ఎక్కువగా ఏడిపిస్తుంటానని  చెప్పుకొచ్చింది. సినిమాలో హీరోయిన్ గా నటించిన హన్సికపై కూడా కొన్ని కామెంట్స్చేశాడు సందీప్ కిషన్.

మొదటిసారి హన్సికతో కలిసి పని చేశానని.. ఆమె చాలా సెన్సిటివ్ అని చెప్పారు. తను అందరి హీరోయిన్లతో క్లోజ్ గా ఉంటానని, కానీ హన్సిక మాత్రం క్లోజ్ అవ్వలేకపోయానని చెప్పాడు. దానికి ఇంకాస్త సమయం పడుతుందని.. కానీ హన్సిక మాత్రం చాలా మంచి అమ్మాయి అని చెప్పుకొచ్చాడు.

click me!