భర్త ఫోటోలు డిలీట్ చేసిన కలర్స్ స్వాతి.. ఏం జరిగింది ?

Published : Apr 19, 2020, 09:38 AM IST
భర్త ఫోటోలు డిలీట్ చేసిన కలర్స్ స్వాతి.. ఏం జరిగింది ?

సారాంశం

అద్భుతమైన నటనా ప్రతిభ కలిగిన తెలుగు హీరోయిన్లలో స్వాతి రెడ్డి ఒకరు. స్వాతి రెడ్డి వెండితెరపై కలర్స్ స్వాతి గా పేరుగాంచింది. క్యూట్ డైలాగులు, అమాయకమైన చూపులు, కొంచెం కొంటెతనం కలిగిన స్వాతి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

ఇదిలా ఉండగా స్వాతి 2018లో తన ప్రియుడు, పైలెట్ అయిన వికాస్ వాసుని వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం అయినప్పటికీ ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరి వివాహం జరిగింది. తాజాగా స్వాతి వైవాహిక జీవితంపై పలు అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. 

ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న శ్రీదేవి ఫ్యామిలీ ఫోటో

అందుకు కారణం స్వాతి ఇటీవల సోషల్ మీడియా నుంచి తన భర్త ఫోటోలని డిలీట్ చేయడమే. తన పెళ్లి ఫోటోలతో పాటు వికాస్ వాసుతో ఉన్న అన్ని ఫోటోలని పోస్ట్ లని స్వాతి సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. దీనితో కలర్స్ స్వాతి వైవాహికజీవితంలో బ్రేకప్ జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

అదే సమయంలో స్వాతి తన పర్సనల్ లైఫ్ ని మరింత ప్రైవేట్ గా ఉంచాలని భావించి ఉండొచ్చని, అందుకే భర్త ఫోటోలని డిలీట్ చేసి ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఇలియానా, శ్వేతా బసు, అమలాపాల్ లాంటి హీరోయిన్లంతా తన రిలేషన్ షిప్ ని బ్రేకప్ చేసుకున్న సమయంలో ముందుగా సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?