సినీ ఇండస్ట్రీ రాజకీయాలే సుశాంత్ ను బలితీసుకున్నాయి: పూనమ్ కౌర్

By Sree s  |  First Published Jun 14, 2020, 7:12 PM IST

సుశాంత్ సింగ్ మరణంపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్  దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే... అందర నటులకు ఎదురయ్యే అనేక సమస్యలను ఆమె మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. 


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం యావత్ దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. హీరోగా, విలక్షణ నటుడిగా అనతికాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అతని అర్థాంతర మరణం ఇప్పుడు సినీలోకంపై ఎప్పటినుండో ఉన్న ప్రశ్నలను ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకొస్తున్నాయి. 

సుశాంత్ సింగ్ మరణంపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్  దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే... అందర నటులకు ఎదురయ్యే అనేక సమస్యలను ఆమె మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. 

Latest Videos

undefined

"సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి కరెక్ట్ కారణం మనకు ఎప్పటికి తెలియకపోవచ్చు. బహుశా ఆ నటుడి మరణ వార్త వల్ల కలిగిన షాక్ లో ఇలా మాట్లాడుతున్నాను కాబోలు... మొఖం మీద చిరునవ్వు ఉన్నంత మాత్రమే పరిస్థితి అంతా  బాగున్నట్టు కాదు. షాక్ కి  గురయ్యాను,కానీ యాక్టర్లు ఎదుర్కునే సమస్యలను చూసి ఆశ్చర్యానికైతే గురవడంలేదు!" అని ట్వీట్ చేసింది. 

Let me tell you we will not know the actual reason .......may be I m emotional may be I am drawing conclusions out of shock ..... but smile doesn’t mean anything .....shockedddddd!!! but not surprised about what actors go thru ....

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal)

ఈ ట్వీట్ కన్నా ముందు మరో ట్వీట్లో ఇండస్ట్రీలో పాలిటిక్స్ ని ఆపండి అంటూ ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టింది. "డిప్రెషన్ వల్ల ఒక విలక్షణ నటుడు మరణించాడు. మానసిక ఆరోగ్యం బాగాలేకపోతే ఒక మనిషికి ఏ గతి పడుతుందో ఈ ఉదంతం నిరూపిస్తుంది. చిరునవ్వు ఉండగానే అంతా బాగున్నట్టు కాదు. ఇండస్ట్రీ ఓ మనిషికి ఏ గతి పట్టిచ్చిందో చూడండి. షాకింగ్" అని ట్వీట్ చేసింది. 

What depression n mental illness can do to a person .......incredible actor ,smile on persons face doesn’t mean anything, shockeddddddd.,what this industry can do to a person ..... (stop politics in movie industry)

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal)

పూనమ్ కౌర్ కూడా డిప్రెషన్ బారినపడ్డ విషయం తెలిసిందే. ఆమె డిప్రెషన్  చాలా కాలాంపాటు ఆమె డిప్రెషన్ కి  తీసుకున్నారు. 

ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కి లోనయి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలియవస్తుంది. అతను ఆరు నెలలుగా డిప్రెషన్ కి మందులు వాడుతున్నారు. అతని ఇంట్లోంచి పోలీసులు మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

click me!