మోసం చేశాడని సినీ ఆర్టిస్ట్ సుధ ఫిర్యాదు: పోలీసుల అదుపులో శ్యామ్ కె నాయుడు

Published : May 27, 2020, 01:57 PM IST
మోసం చేశాడని సినీ ఆర్టిస్ట్ సుధ ఫిర్యాదు: పోలీసుల అదుపులో శ్యామ్ కె నాయుడు

సారాంశం

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడిపై సినీ ఆర్టిస్టు సుధ హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడిని హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు ప్రముఖ సినిమాటో గ్రాఫర్ ఛోటా కే నాయుడి తమ్ముడు. సినీ ఆర్టిస్ట్ సుధ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్యామ్ కె నాయుడు తనను మోసం చేశారని సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోకిరి, గంగతో రాంబాబు తదితర సినిమాలకు శ్యామ్ కె నాయుడు పని చేశారు. ఈ క్రమంలోనే సుధకు శ్యామ్ కె నాయుడితో పరిచయమైంది.

వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?