ఆమె నాకు సవాల్ విసిరింది.. రెచ్చిపోయిన మోహన్ బాబు

Published : May 01, 2020, 03:25 PM IST
ఆమె నాకు సవాల్ విసిరింది.. రెచ్చిపోయిన మోహన్ బాబు

సారాంశం

కరోనా ప్రభావంతో ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. షూటింగులు ఆగిపోవడంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఇళ్లకే పరిమితమైంది.

కరోనా ప్రభావంతో ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. షూటింగులు ఆగిపోవడంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఇళ్లకే పరిమితమైంది. సెలెబ్రిటీలంతా ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల మధ్య ప్రస్తుతం పలు ఛాలెంజ్ లు వైరల్ అవుతున్నాయి. బి ది రియల్ మ్యాన్ అంటూ స్టార్ హీరోలు, దర్శకులు తమ ఇళ్లలో ఇంటి పని వంటపని చేసేస్తున్నారు. 

సాహో బ్యూటీ.. ఈ అందాల సునామీని ఆపడం కష్టం

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు కూడా ఛాలెంజ్ ఎదురైంది. ప్రముఖ వ్యాపారవేత్త, కళాబంధుగా పేరుగాంచిన టి సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ వంట చేసి చూపించాలని మోహన్ బాబుకు సవాల్ విసిరింది. మోహన్ బాబు ఆమె సవాల్ స్వీకరించారు. పింకీ నాకు సవాల్ విసిరింది.. వంట చేయమని.. చేసి చూపిస్తా అని మోహన్ బాబు వంట గదిలో రెచ్చిపోయారు. 

తన మనవరాలి సాయంతో మోహన్ బాబు చకచకా మసాలా వడ తయారు చేశారు. ఈ వీడియోని మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మోహన్ బాబు వంట గదిలో గరిట తిప్పిన వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?