'ఇండియన్ 2' ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!

Published : Feb 21, 2020, 11:36 AM IST
'ఇండియన్ 2' ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!

సారాంశం

నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కి సమన్లు జారీ చేశారు. అయితే బుధవారం ఇండియన్ 2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద క్రేన్ విరిగిపడింది.

ఇండియన్ 2 షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో నిర్మాతలు, క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్ ల పేర్లు పొందుపరిచారు.

అలాగే నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కి సమన్లు జారీ చేశారు. అయితే బుధవారం ఇండియన్ 2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద క్రేన్ విరిగిపడింది. ఈ  ప్రమాదంలో మధు, సాయి కృష్ణ, చంద్రన్ అనే టెక్నీషియన్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దర్శకుడు శంకర్ కూడా గాయాలపాలయ్యారు. 

ఇండియన్ 2 ప్రమాదం: మృతుల కుటుంబాలకు కమల్ హాసన్ విరాళం.. ఎంతంటే!

లైటింగ్ సెటప్ ఏర్పాటు చేస్తున్న క్రేన్ అకస్మాత్తుగా విరిగి పడడంతో ఈ ఘోరం జరిగింది. ఈ సంఘటన చిత్ర యూనిట్ ని విషాదంలోకి నెట్టివేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ సంస్థ, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ స్పందించారు. 

ఈ సంఘటన తనని ఎంతగానో కలచివేసిందని కమల్ హాసన్ స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ మృతుల కుటుంబాలకు తనవంతు విరాళం ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి విరాళం అందించబోతున్నట్లు కమల్ హాసన్ తెలిపారు. 

మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, చిత్ర యూనిట్ కి ధైర్యం చెబుతూ పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?