జనాలు చస్తుంటే ఛార్మికి వెటకారం.. కరోనాపై కామెంట్స్

Published : Mar 02, 2020, 09:49 PM IST
జనాలు చస్తుంటే ఛార్మికి వెటకారం.. కరోనాపై కామెంట్స్

సారాంశం

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఇప్పటికే కరోనా ప్రభావంతో అల్లాడుతోంది. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు కూడా కరోనా ప్రభావం పాకుతోంది.

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఇప్పటికే కరోనా ప్రభావంతో అల్లాడుతోంది. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు కూడా కరోనా ప్రభావం పాకుతోంది. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాల నుంచి చైనాకు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. చైనా అంటేనే ప్రస్తుతం జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. 

ఇదిలా ఉండగా నేడు దేశరాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లలో చెరొక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో భారత ప్రజలలో ఆందోళన పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్ ఛార్మి సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. 

అందాల దేవతలా బాలయ్య హీరోయిన్.. మెస్మరైజ్ చేస్తున్న ఫొటోస్

సోషల్ మీడియాలో ఛార్మి.. కరోనా ఆవైరస్ వెల్కమ్ టు ఇండియా అని కామెంట్స్ చేసింది. ఛార్మి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఓవైపు జనాలు చస్తుంటే.. ఇలాంటి పరిణితి లేని వ్యాఖ్యలు ఏంటి అని ఛార్మిపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. సిచ్యుయేషన్ అర్థం చేసుకున్న ఛార్మి వెంటనే ఆ వీడియో డిలీట్ చేసింది. 

యంగ్ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. వైరల్ అవుతున్న పిక్

తిరిగి మరో పోస్ట్ పెట్టి క్షమాపణలు కోరింది. 'మీ కామెంట్స్ అన్నీ చదివాను. ఇలాంటి సంధర్భంలో అలాంటి వీడియో పోస్ట్ చేయడం నాదే తప్పు. చాలా సున్నితమైన అంశంపై అనాలోచితంగా కామెంట్స్ చేశాను. క్షమించండి.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగవు అని ఛార్మి ట్వీట్ చేసింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?