'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'.. మళ్లీ సెన్సార్ చిక్కులు!

By AN TeluguFirst Published Dec 11, 2019, 1:53 PM IST
Highlights

సినిమా రిలీజ్ ని ఆపాలని కోర్టుని కోరారు. సెన్సార్ కార్యక్రమాలు జరకపోవడంతో సినిమా వాయిదా పడింది. దీంతో చిత్రబృందం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. అక్కడ టైటిల్ ని 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని పేరు మార్చుకొని సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి మొదలైన వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా టైటిల్ మాత్రమే కాకుండా కథ మొత్తం ఏపీ ప్రస్తుతం రాజకీయాల మాదిరి ఉందని సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై కోర్టులో చాలా పిటిషన్లు వేశారు. సినిమా రిలీజ్ ని ఆపాలని కోర్టుని కోరారు. సెన్సార్ కార్యక్రమాలు జరకపోవడంతో సినిమా వాయిదా పడింది. దీంతో చిత్రబృందం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. అక్కడ టైటిల్ ని 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అని పేరు మార్చుకొని సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

"అల.. వైకుంఠపురములో" బన్నీ కంటే పవర్ఫుల్ రోల్?

ఈ నెల 12న సినిమాని విడుదల చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేశారు. రేపే రిలీజ్ అయినప్పటికీ సెన్సార్ సర్టిఫికేట్ రాలేదని తెలుస్తోంది. రీజనల్ సెన్సార్ అధికారి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని యూనిట్ వర్గాల భోగట్టా.. రివిజన్ కి వెళ్లి వచ్చినా.. సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వడం లేదనేది తెలియాల్సివుంది.

ఈ మేరకు నిర్మాతలు మరికొద్దిసేపట్లో సెన్సార్ ఆఫీస్ దగ్గరే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అసలు విషయం అక్కడే తేల్చుకుంటామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ గొడవ మొత్తం చూస్తుంటే రేపు కూడా సినిమా విడుదల కాదేమోననే సందేహాలు కలుగుతున్నాయి.  

click me!