
రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ 2002లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఒక్కో విజయం సాధించుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ అగ్ర నటుడిగా ఎదిగాడు. ఇక రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
తెలుగు సినిమాకు ప్రపంచస్థాయిలో బాహుబలి చిత్రం గుర్తింపు తీసుకువచ్చింది. నేడు ప్రభాస్ తన 40వ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రభాస్ కు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు.
'యూనివర్సల్ డార్లింగ్ కు బర్త్ డే శుభాకాంక్షలు. ఆకాశాన్ని తాకే సంతోషాన్ని నువ్వు అందుకోవాలి. నీతో కలసి నటించడం సంతోషాన్ని కలిగించే అంశం' అని చందమామ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.
'ప్రభాస్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు' అని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.
డార్లింగ్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ట్వీట్.
డార్లింగ్ ప్రభాస్ కు హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్ డే శుభాకాంక్షలు.. నీవు ఇంకా జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలి అని దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
బాహుబలి ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఐపీఎల్ ప్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో క్రికెటర్లు డేవిడ్ వార్నర్, విలియంసన్ బాహుబలి గురించి కామెంట్ చేసిన వీడియో షేర్ చేసింది.
సోదరుడు ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు.. ఆ చిరునవ్వుని అలాగే కొనసాగించు అని భల్లాల దేవుడు రానా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు.