'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' హైకోర్టులో మరో పిటిషన్!

By AN TeluguFirst Published Nov 26, 2019, 12:19 PM IST
Highlights

తాజాగా ఈ సినిమా విడుదల ఆపాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.  సినిమా విడుదల నిలిపివేయాలని పిటిషనర్ ఇంద్రసేనా చౌదరిహైకోర్టుని కోరారు. ఈ సినిమా కారణంగా కమ్మ, రెడ్డి కులస్థుల మధ్య గొడవలు జరుగుతాయని పిటిషనర్ అన్నారు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న ''కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. తనను అవమానించేలా మూవీలో సన్నివేశాలు ఉన్నాయంటూ పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు.

సినిమా విడుదల నిలిపేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.  తాజాగా ఈ సినిమా విడుదల ఆపాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది.  సినిమా విడుదల నిలిపివేయాలని పిటిషనర్ ఇంద్రసేనా చౌదరి హైకోర్టుని కోరారు. ఈ సినిమా కారణంగా కమ్మ, రెడ్డి కులస్థుల మధ్య గొడవలు జరుగుతాయని పిటిషనర్ అన్నారు.

సునీల్ కోసం త్రివిక్రమ్ తిప్పలు?

ఈ నెల 29న సినిమా విడుదల ఉన్నందున వెంటనే విచారణ జరపాలని పిటిషన లాయర్ బాలాజీ కోర్టుని కోరారు. దీంతో హైకోర్టు రేపు విచారణ చేస్తామని తెలిపింది. వర్మకి ఇలాంటి కేసులు కొత్తేమీ కాదు. గతంలో తను రూపొందించిన చాలా సినిమాలకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు వర్మ.

అయినప్పటికీ రాజీ పడకుండా వివాదాస్పద కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకత చాటుతున్నాడు. ఇప్పుడు ఏపీ సమకాలీన రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈ తరహా సినిమాను తెరకెక్కించాడు. 24 గంటల్లో యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ కి మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 

click me!