ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు. అంతఃపురంలో శ్రీరాముడి వైభోగాలపై, ఆహారపు అలవాట్లపై కత్తి మహేష్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.
వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తన నోటికి పని చెప్పాడు. గతంలో కత్తి మహేష్ టీవీ చర్చా కార్యకమాల్లో బాగా హల్ చల్ చేశాడు. ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని కత్తి మహేష్ మరోసారి దుర్భాషలాడాడు.
అంతఃపురంలో శ్రీరాముడి వైభోగాలపై, ఆహారపు అలవాట్లపై కత్తి మహేష్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. అలాగే బాహ్మణుల గురించి కూడా కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
undefined
రాముడిపై కామెంట్స్.. అడ్డంగా బుక్కైన ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్!
దీంతో హిందూ సంఘాలు అతడిపై చర్యలకు సిద్ధం అయ్యాయి. హైదరాబాద్ కు చెందిన ఉమేష్ కుమార్, మరికొందరు హిందూ నాయకులు కత్తి మహేష్ పై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు చేశారు. కత్తి మహేష్ వ్యాఖ్యలని తీవ్రంగా పరిగణించాలని వారు పోలీసులని కోరారు.
తాజాగా.. అడ్వకేట్ కె. కరుణ సాగర్ కత్తి మహేష్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుని నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నెం: 196/2020 u / s 506, 507-IPC సెక్షన్ల కింద కత్తి మహేష్ పై కేసు నమోదు చేశారు.
గతంలో కూడా కత్తి మహేష్ రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని వివాదాల కారణంగా అతడిని పోలీసులు కొన్ని రోజుల పాటు నగరం నుంచి బహిష్కరించారు.