పవన్ రెండో భార్య రేణుదేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది. పిల్లలు పెద్దవారు కావడంతో వారి భవిష్యత్తు తీర్చి దిద్దాల్సిన భాద్యత పవన్ పై ఉంది.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిపై రకరకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా వీటికి మినహాయింపు కాదు. తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండో భార్య, పిల్లల కోసం ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ని కొన్నారట.
పవన్ రెండో భార్య రేణుదేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది. పిల్లలు పెద్దవారు కావడంతో వారి భవిష్యత్తు తీర్చి దిద్దాల్సిన భాద్యత పవన్ పై ఉంది. ఈ సమయంలో పిల్లలు తండ్రి పవన్ కి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
undefined
పవన్ సినిమాలో రేణుదేశాయ్.. అసలు నిజమిదే!
అందుకే రేణుదేశాయ్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారని టాక్. పవన్ కొడుకు ఎప్పటికైనా హీరోని చేయాలనే ఆలోచనలో రేణుకి ఉందని సమాచారం. ఇలా హైదరాబాద్ షిఫ్ట్ అయిన రేణు దేశాయ్, పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఓ ఫ్లాట్ కొన్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
నటుడు మురళీమోహన్ కి చెందిన ఓ విలాసవంతమైన వెంచర్ లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందనే విషయం పవన్ కానీ, రేణు కానీ నోరు విప్పితేనే తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల పవన్ వరుస ప్రాజెక్ట్స్ లో నటించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా 'పింక్' రీమేక్ లో నటిస్తున్నాడు. ఆ తరువాత క్రిష్, హరీష్ శంకర్ లతో కలిసి సినిమాలు చేయబోతున్నాడు.