టీవీ నటుడిపై లైంగిక వేధింపుల కేసు!

By AN Telugu  |  First Published Feb 12, 2020, 12:34 PM IST

ఓ యువతిని లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు రావడంతో ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఐపీసీ సెక్షన 354, 509 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం నాడు పోలీసులు వెల్లడించారు.


ప్రముఖ సినిమా, టీవీ నటుడు షాబాజ్ ఖాన్ పై లైంగిక వేధింపుల కేసుని నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఓ యువతిని లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు రావడంతో ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఐపీసీ సెక్షన 354, 509 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం నాడు పోలీసులు వెల్లడించారు.

కాగా ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయనపై ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఏఎన్ఐ న్యూస్ వెల్లడించింది. పలు హిందీ సీరియల్స్ లో ప్రతి నాయకుడి పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న షాబాజ్ ఖాన్ అసలు పేరు హైదర్ ఖాన్.

Latest Videos

undefined

స్కిన్ షో, సెక్సీ లుక్స్.. మహేష్ బ్యూటీ మతిపోగోడుతోంది!

శాస్త్రీయ గాయకుడిగా పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్న ఉస్తాద్ మీర్ ఖాన్ కుమారుడే షాబాజ్. రామా సియా కే లవ్‌ కుష్‌, సలామ్‌ అలీ ఖాన్‌ వంటి హిందీ సీరియల్స్ తో పాటు వెండితెరపై కూడా ప్రతినాయకుడి పాత్రల్లో నటించి పాపులర్ అయ్యారు. 

 

Mumbai: Case of molestation filed against actor Shahbaz Khan at Oshiwara Police Station. FIR registered under IPC sec 354 (Assault or criminal force to woman with intent to outrage her modesty) & 509 (Word, gesture or act intended to insult modesty of a woman). Investigation on.

— ANI (@ANI)
click me!