
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మెప్పించిన ఆశిష్ విద్యార్థి వివాహం చేసుకుని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. 60 ఏళ్ల వయసులో ఆయన 33 ఏళ్ల రుపాలి బరువాను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ వివాహంపై ఆయన స్పందించారు. తన మొదటి భార్య పిలో విద్యార్థితో విడాకుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా విడాకుల తర్వాత ఆమెతో మాట్లాడానని కూడా తెలిపారు.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ మీడియా అతని మొదటి భార్య రాజౌషీని సంప్రదించి ఆశిష్ రెండో పెళ్లి గురించి అడిగింది. దీనికి ఆమె చెప్పిన సమాధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఆశిష్ విద్యార్థి కొన్నాళ్లుగా సొంత యూ ట్యూబ్ ఛానల్ లో వీడియో వ్లాగ్స్ చేస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ముఖ్యంగా ఫుడ్ వ్లాగ్స్ తో ఆయన ఛానల్ బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆ వీడియోల్లో కొన్ని రోజుల క్రితమే మొదటి భార్యతో చాలా సంతోషంగా ఉన్న వీడియో కూడా ఒకటి ఉంది. మరి ఇంతలోనే రెండో పెళ్లేంటీ అనుకున్నవారికి మొదటి భార్య ఇచ్చిన వివరణ ఏంటి అంటే..?
నిజానికి వీళ్లు 2001లోనే విడిపోయాం. అప్పటి నుంచి అప్పుడప్పుడూ కలిసుకుటున్నా.. భార్య భర్తలుగా విడిపోయి 22యేళ్లైంది. అయితే గతేడాది అక్టోబర్ లోనే చట్ట పరంగా విడాకులకు అప్లై చేశాం. ఆ విడాకులు ఈ యేడాది మంజూరయింది. ఇక జనాలు మా గురించి కన్సర్న్ తో మాట్లాడుకోవటంతో నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. నిజానికి ఆశిష్ ఆశిష్ నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. అతను కోరుకున్నదంతా మళ్లీ పెళ్లి చేసుకోవడమేనని జనాలు అనుకుంటున్నారు కూడా. ఇది పూర్తిగా తప్పుడు కథనం."
తన వివాహంలో "ప్రజలు ఊహిస్తున్నట్లుగా హింస, కష్టాలు వంటివి ఏమీ లేవు" అని ఆమె మరింత నొక్కి చెప్పారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు తమ భవిష్యత్‌లో భిన్నమైన విషయాలను కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. ఆమె కంటిన్యూ చేస్తూ ..., “మేమిద్దరం వేర్వేరు వ్యక్తులం. మేము మా ప్రత్యేక మార్గాల్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము , ఇప్పుడు అతను తన కెరీర్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. నేను గత ఐదేళ్లుగా ఇన్నేళ్లగా మిగిలిపోయిన చాలా విషయాలు చూసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితంలో, నాకు ఇప్పుడు వేర్వేరు అవసరాలు, లక్ష్యాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఆయన శ్రీమతిగా మిసెస్ విద్యార్థిగా ఆ లక్ష్యాన్ని పూర్తి చేయలేను అని అర్దం చేసుకునే ప్రక్కకు తప్పుకున్నాను అన్నారు.
వీటిన్నటి దృష్యానే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆశిష్ కు మొదటి భార్య ద్వారా ఒక కొడుకు ఉన్నాడు అతను ఆస్ట్రేలియాలోని టెస్లాలో జాబ్ చేస్తున్నాడట. అయితే ఆశిష్ తో గడిపిన జీవితం తనకు ఎంతో గొప్పది అంటుంది మొదటి భార్య రాజౌశి. ప్రస్తుతం ఆశిష్ విద్యార్థి పెళ్లి వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
మరో ప్రక్క రాజోషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతున్న సెల్ఫీని పోస్ట్ చేసి.. "జీవితం అనే పజిల్‌లో గందరగోళానికి లోనవద్దు' అని రాసుకొచ్చింది. ఇక స్టోరీలో.. "అర్థం చేసుకునేవాడు నిన్ను ఎప్పుడూ ప్రశ్నించడు, బాధపెట్టే పనులు చేయడు, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి' అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో.. "అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో.. ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో అదంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంతకాలం నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు, అందరి ఆశీర్వాదాలు తీసుకునే టైమొచ్చింది వచ్చింది, అందుకు నువ్వు పూర్తి అర్హురాలివి" అని రాసుకొచ్చింది.