బ్రేకింగ్: దిగ్గజ నటుడు రిషి కపూర్ మృతి.. షాక్ నుంచి కోలుకోక ముందే..

By tirumala ANFirst Published Apr 30, 2020, 9:48 AM IST
Highlights

ప్రముఖ హిందీ నటుడు రిషీ కపూర్ (67) కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రముఖ హిందీ నటుడు రిషీ కపూర్ (67) కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. 67 ఏళ్ల రిషీ కపూర్ ను బుధవారం ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. ఈ విషయాన్నీ ఆయన సోదరుడు రణధీర్ కపూర్ ధృవీకరించారు.  ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని చెప్పారు. కానీ ఇంతలోనే చేదు వార్త వచ్చింది. 

బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం నిన్ననే లెజెండ్రీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుంచి బాలీవుడ్ కోలుకోక ముందే మరో విషాదం జరిగింది. 

గత కొంతకాలంగా రిషి కపూర్ క్యాన్సర్ సంబందింత వ్యాధితో బాధపడుతున్నారు. గత ఏడాది ఆయన అమెరికాలో చికిత్స కూడా పొందారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు మొత్తం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. రిషీ కపూర్ అమెరికాలో ఏడాది పాటు క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న తర్వాత సెప్టెంబర్ లో ఇండియాకు వచ్చారు. ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. కుటుంబ వేడుకకు హాజరైనప్పుడు ఢిల్లీలో మొదటిసారి ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఇన్ ఫెక్షన్ తో బాధపడ్డారు.

ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరారు. రిషి కపూర్ హిందీలో  వందలాది చిత్రాల్లో నటించారు. రిషి కపూర్ 1952 సెప్టెంబర్ 4 ముంబైలో జన్మించారు. రిషి కపూర్ సతీమణి నీతు సింగ్. ఆయన కుమారుడు రణబీర్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతున్నాడు. రిషి కపూర్ మృతిపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. 

1955లోనే రిషి కపూర్ శ్రీ 420 అనే చిత్రంలో మెరిశారు. ఆ తర్వాత 1970 రిషి సినీకెరీర్ పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. 1970లో రిషి కపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో నటించారు. అమర్ అక్బర్ ఆంటోని, లైలా మజ్ను, రఫూ చక్కర్, సర్గం, కార్జ్, బోల్ రాధా బోల్ లాంటి అద్భుత చిత్రాల్లో రిషి కపూర్ నటించారు. ఆయన మరణం ఇండియన్ సినిమా తీరని లోటు. 

click me!