బిగ్ బాస్ నాకిచ్చింది చాలా తక్కువ.. రెమ్యునరేషన్ పై రాహుల్ కామెంట్స్!

By AN TeluguFirst Published Nov 7, 2019, 1:04 PM IST
Highlights

హౌస్ లో అందరికంటే శ్రీముఖికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గెలిచిన రాహుల్ కి మాత్రం డైలీ పేమెంట్స్ లేవు. 

సీజన్ 3 విజేతగా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన రెమ్యునరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి కంటెస్టంట్స్ కి వారి పాపులారిటీ బట్టి రెమ్యునరేషన్స్ ఫిక్స్ చేస్తుంది స్టార్ మా యాజమాన్యం. ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా హౌస్ లో ఉన్నన్ని రోజులు కంటెస్టంట్లకు రెమ్యునరేషన్ ఇచ్చింది.

కొంతమందికి రోజుకి ఇంత అని, మరికొంతమందికి వారం చొప్పున పారితోషికం చెల్లించారు. హౌస్ లో అందరికంటే శ్రీముఖికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గెలిచిన రాహుల్ కి మాత్రం డైలీ పేమెంట్స్ లేవు. తనకు వారానికి ఓసారి డబ్బులు ఇచ్చేవారని.. అది కూడా చాలా తక్కువగా ఇచ్చారని అంటున్నాడు రాహుల్.

'రాములో రాములా' సాంగ్ మిస్ అయ్యా.. బిగ్ బాస్ విన్నర్ రాహుల్!

 షో కోసం తనకు ఎంత ఇచ్చారనేది వ్యక్తిగత విషయమని.. అది బయటకి చెప్పలేనని అన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తానని.. అందరూ అనుకుంటున్నట్లు తనకు లక్షల్లో  రెమ్యునరేషన్ ఇవ్వలేదని.. చాలా తక్కువ ఇచ్చారని అన్నారు.

బయట ఓ కార్యక్రమం చేస్తే తనకు ఎంత వస్తుందో బిగ్ బాస్ హౌస్ లో వారానికి అంత చొప్పున లెక్కగట్టి ఇచ్చారని.. బయటకి చెప్పలేని మొత్తం అది అని చెప్పుకొచ్చారు. పేమెంట్ సంగతి పక్కన పెడితే యాభై లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడని అనుకోవచ్చు కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న టాక్స్ విధానం ప్రకారం.. గిఫ్ట్స్, లాటరీ ప్రైజ్, ప్రైజ్ మనీగా సంపాదించిన మొత్తంపై టాక్స్ ఎక్కువగా ఉంది.

అలా రాహుల్ సంపాదించిన యాభై లక్షల ప్రైజ్ మనీలో దాదాపు రూ.15 లక్షలు టాక్స్ రూపంలో పోయిందని చెబుతున్నారు. తన రెమ్యునరేషన్ ద్వారా వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ కలిపి ఉన్నంతలో ఓ సొంతిల్లు తీసుకుంటానని చెబుతున్నాడు రాహుల్. ఇన్నాళ్లు అద్దె ఇంట్లో ఉన్నామని.. ఇకపై సొంత ఇల్లు తీసుకుంటామని చెబుతున్నాడు రాహుల్. డబ్బు మిగిలితే గనున సెలూన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు. 

click me!